BigTV English

OTT Movies : ఓటీటీకి సెన్సార్.. ఇక మీదట ఆ సినిమాలు లేనట్లే?

OTT Movies : ఓటీటీకి సెన్సార్.. ఇక మీదట ఆ సినిమాలు లేనట్లే?

OTT Movies : థియేటర్ల లోకి వచ్చిన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు.. అలాగే హిట్ అయిన ప్రతి సినిమా ఓటీటీలోకి మంచి టాక్ ను అందుకుంటుందని అనుకోలేము.. మూవీస్ కు ఉన్న సెన్సార్ రిపోర్ట్ ఓటీటీకి లేదు.. ఇన్నాళ్లు బోల్డ్ మూవీస్ డైరెక్ట్ గా ఓటీటీ లోకి రిలీజ్ అవుతూ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే ఓటీటీ కంటెంట్ లో ఎటువంటి సెన్సార్ లు లేకపోవడంతో సినిమాలు ఇక్కడ బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్నాయి. ఇంతవరకూ ఎలాంటి సెన్సార్ లేని సంగతి తెలిసిందే. తీసిన కంటెంట్ ని నచ్చినట్లు ఎలా వీలు అయితే అలా విడుదల చేసుకునే వెసులు బాటు ఉంది.. ఇక మీదట అలాంటి పప్పులు ఉడకవని తెలుస్తుంది. ఇక్కడ కూడా సెన్సార్ రివ్యూ అనేది ఉండబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు మ్యాటర్ ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..


సినిమాల్లో ఏదైనా బోల్డ్ సీన్స్ ఉంటే వాటికి సెన్సార్ కట్ అనేది ఉంటుంది. కానీ ఓటీటీ రిలీజ్ కి ప్రభుత్వం నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అందుకే బోల్డ్ సినిమాలు తీసే డైరెక్టర్స్ ఓటీటీ వేదికగా తన సినిమాల్ని రిలీజ్ చేసుకుంటుంటాడు. థియేటర్ రిలీజ్ అయితే సెన్సార్.. ఎటువంటి కట్లు ఇలా చాలా కోత పడుతుంది. కంటెంట్ ని జనాలకు మేకర్స్ ఎలా చూపించాలనుకుంటున్నారో? అలా చూపించుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇలా కంటెంట్ ని ఇలా రిలీజ్ చేయడంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఓటీటీ సంస్థలు యువత ను చెడగొడుతున్నాయానే టాక్ వినిపిస్తుండటం తో సెన్సార్ సభ్యులు ఓటీటీ పై కూడా రిపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. త్వరలోనే ఈ సెన్సార్ రిపోర్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం కొన్ని స్వీయా నియంత్రణలు అవసరమని ఓటీటీ లకు సూచించింది. అయితే అది పేరుకే తప్ప పాటించేది ఎవరు? దీంతో ఇలాంటి సమస్యల్ని పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫారమ్‌లు వీక్షకుల వయస్సు వర్గాల ఆధారంగా కంటెంట్‌ను నియంత్రించే లక్ష్యంతో మార్గ దర్శకాల ను పాటించడం లేదని కొన్ని ఫిర్యాదు లు అందడం తోనే నేరుగా పెద్ద ఆఫీసర్లు రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తుంది. వయసు ను బట్టి సెన్సార్ రిపోర్ట్ ఉంటుందని సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఇలా చేస్తే కంటెంట్ విషయంలో రిలీజ్ కి ముందు కొన్ని రకాల సర్టిఫికెట్ లు రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.. మరి దీని పై త్వరలోనే క్లారిటీ రానుందని వార్తలు ఇండస్ట్రీ లో వినిపిస్తున్నాయి.. ఇలాంటి రూల్స్ వస్తే ఇక బోల్డ్ కంటెంట్ సినిమాలకు కాలం చెల్లినట్లే.. అలాంటి సినిమాలు తీసే డైరెక్టర్స్ జర జాగ్రత్త సుమీ..


Tags

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×