BigTV English

PavithraNaresh : పవిత్ర బంధం.. 2 మనసులు..3 ముళ్లు.. ఏడడుగులు.. వీడియో వైరల్..

PavithraNaresh : పవిత్ర బంధం.. 2 మనసులు..3 ముళ్లు.. ఏడడుగులు.. వీడియో వైరల్..

PavithraNaresh :సీనియర్‌ నటుడు నరేష్ మరోసారి విహహబంధంలోకి అడుగుపెట్టాడు. సహ నటి పవిత్రా లోకేష్ ను వివాహమాడాడు. తాజాగా ఈ జంట పెళ్లి సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. పెళ్లి వీడియోను ట్విటర్‌ లో నరేష్ షేర్‌ చేశాడు. అందరి ఆశీస్సులు కావాలని కోరాడు.


శాంతి, సంతోషాలతో కూడిన తమ నూతన ప్రయాణానికి ఆశీస్సులు కోరుతున్నానని నరేష్ అన్నాడు. ఒక పవిత్ర బంధం.. రెండు మనసులు.. మూడు మూళ్లు.. ఏడడుగులు.. మీ ఆశీస్సులు కోరుకుంటూ మీ పవిత్రా నరేశ్‌ అని ట్వీట్ చేశాడు. వీరి పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొంతకాలంగా సోషల్ మీడియాలో నరేష్ , పవిత్ర జంట హాట్ టాపిక్ గా ఉంది. వీరు ఎక్కడికెళ్లినా వివాదాలు చుట్టుముట్టేవి. ఈ జంట ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
పవిత్రా లోకేష్ తో సహజీవనం చేస్తున్నానని ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాలు నరేష్ చుట్టూ తిరిగాయి. ఆయన మూడో భార్య రమ్యారఘుపతితో గొడవలు జరిగాయి. పరస్పరం కేసులు పెట్టుకున్నారు.


ఆ వివాదాల నేపథ్యంలోనే త్వరలో పవిత్రను పెళ్లి చేసుకుంటానని కొంతకాలం క్రితం నరేష్ ప్రకటన చేశాడు. పవిత్రను లిప్ లాక్ చేస్తూ అప్పట్లో నరేష్ విడుదల చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇలా ఎన్నో వివాదాల తర్వాత పవిత్రను పెళ్లి చేసుకుని నరేష్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు.

Nagababu Tammareddy: రూ.80 కోట్లు మీ అమ్మా మొగుడు ఖ‌ర్చు పెట్టాడా?.. త‌మ్మారెడ్డిపై నాగ‌బాబు ఫైర్‌

RRR : ఆ ఖర్చులపై లెక్కలున్నాయా..? తమ్మారెడ్డికి దర్శకేంద్రుడు కౌంటర్..

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×