Pavitra Gowda:పవిత్ర గౌడ (Pavitra Gowda).. ఈ పేరును ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు అని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా పెళ్లయిన వ్యక్తితో సంబంధం పెట్టుకోవడమే కాకుండా ఆ సంబంధాన్ని ప్రశ్నించిన వ్యక్తిని ఏకంగా భూమి మీద లేకుండా చేసిందని నెటిజన్స్ సైతం మండిపడుతున్నారు. హీరో దర్శన్ (Hero Darshan) తో ఉన్న రిలేషన్ కారణంగానే, ఈ బంధాన్ని ప్రశ్నించిన అభిమాని రేణుకా స్వామి (Renuka swamy)ని దర్శన్ తో కలసి దాదాపు కొంత మంది బృందంతో రేణుకా స్వామిని అత్యంత చిత్రవధకు గురిచేసి, హతమార్చిన వైనం అందరినీ ఉలిక్కిపడేలా చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన పవిత్ర గౌడ.. నేరుగా ఇంటికి వెళ్లకుండా దేవాలయానికి వెళ్లి అక్కడ దర్శన్ బాగుండాలని పూజలు చేయించినట్లు సమాచారం. ఇకపోతే ఇదంతా ఇలా ఉండగా ప్రస్తుతం మహా కుంభమేళా ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో.. పవిత్ర గౌడ మహా కుంభమేళాను దర్శించి, అక్కడ పవిత్ర స్నానం చేసినట్లు ఫోటోలను షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ పూర్తిస్థాయిలో ఈమెపై మండిపడుతున్నారు.
మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన పవిత్ర..
ప్రతి 144 సంవత్సరాల కి ఒకసారి వచ్చే మహాకుంభమేళా.. ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. ఈ మహా కుంభ మేళాలో త్రివేణి సంగమంలో మౌని అమావాస్య రోజు అమృత స్నానం ఆచరించింది పవిత్ర గౌడ. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను తన అధికారిక ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. “ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహా కుంభమేళాలో స్నానం ఆచరించడాన్ని నేను ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగటివ్ ఎనర్జీ నుండి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను.” అంటూ కూడా తన పోస్టులో రాసుకుంది పవిత్ర గౌడ. అంతేకాదు “హర హర మహాదేవ్” అనే క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో కొద్ది క్షణాల్లోనే పవిత్ర గౌడ పెట్టిన పోస్ట్, వీడియోలు చాలా వైరల్ అవ్వగా.. ఇది చూసిన సినీ అభిమానులు, నెటిజన్స్ ఈమెపై పూర్తిస్థాయిలో మండిపడుతున్నారు.
మండిపడుతూ కామెంట్లు చేస్తున్న నెటిజెన్స్..
ఒక కుటుంబాన్ని రోడ్డున పడేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ ఈమెపై నెగటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. పవిత్ర గౌడ వీటికి స్పందిస్తూ మరో పోస్టు కూడా పెట్టింది. ఆ పోస్టులో ఏముందనే విషయానికి వస్త.. “అన్యాయానికి , మతానికి మధ్య జరిగిన సంఘర్షణలో ఎప్పుడూ మతమే గెలుస్తుంది. నన్ను విమర్శిస్తూ బాధపెడుతున్న కొన్ని న్యూస్ చానల్స్, సోషల్ మీడియా సైట్స్ కి చాలా పెద్ద ధన్యవాదాలు. హద్దులు మీరి.. మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత క్షోభకు గురి చేస్తున్నాయి. నన్ను ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అంటూ పోస్ట్ పెట్టింది. ఏది ఏమైనా చింత చచ్చినా పులుపు చావలేదని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంత జరిగిన సరే ఇంకా కాస్త గట్టిగానే మాట్లాడుతుందని నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక మరి కొంతమంది చేసిన పాపాలు మహాస్నానం చేస్తే తొలగిపోతాయా అంటూ ఇంకాస్త గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. మరి దీనిపై పవిత్ర గౌడ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఏది ఏమైనా క్షణికావేశంలో చేసిన తప్పులు జీవితాంతం వెంటాడుతాయనడంలో సందేహం లేదు అని చెప్పవచ్చు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">