Big Stories

Pawan Kalyan: ‘వారాహి’ రెడీ.. వాహనం ప్రత్యేకతలు ఇవే…

Pawan Kalyan: ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రకటించారు పవన్ కల్యాణ్. వారాహీ రెడీ అంటూ 28 సెకన్ల వీడియో విడుదల చేశారు. వాహనం చుట్టూ పవన్ భద్రత సిబ్బంది రక్షణగా ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

అచ్చం సినిమాటిక్ గా ఉంది ఆ వీడియో. మధ్యలో మిలట్రీ గ్రీన్ కలర్ లో భారీ వెహికిల్. పెద్ద పెద్ద టైర్లు.. పటిష్టమైన బాడీ ఉన్న ఆ వాహనం స్లో మోషన్ లో కదులుతుండగా.. రక్షణగా సెక్యూరిటీ టీమ్ గంభీరంగా నడుస్తున్నారు. లుక్ కోసమో ఏమో.. ముందు వరుసలో ఇద్దరు సిక్కు బాడీగార్డ్స్ ను ఉంచారు. ఆ వీడియో చూస్తేనే.. గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు జనసైనికులు.

- Advertisement -

ఇక ప్రచార రథానికి వారాహి పేరు పెట్టడం కూడా బాగుంది. ఇటీవల సూపర్ హిట్ కొట్టిన కాంతారా మూవీ వారాహి థీమ్ తో తీసిందే. అందులా వరాహరూపం పాట సైతం బ్లాక్ బస్టర్. సముద్రంలో మునిగిపోతున్న భూమిని విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమండలాన్ని రక్షించారు. వరాహ రూపంలోని శక్తి స్వరూపమే వారాహి. జగన్ పాలనలో నిండా మునిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ను రక్షించడానికి వారాహిపై వస్తున్నారు పవన్ కల్యాణ్ అని అంటున్నారు ఫ్యాన్స్.

ఆర్మీ వాహనం లుక్స్ తో.. అలనాటి అన్న ఎన్టీఆర్ ప్రచార వాహనమైన చైతన్యరథాన్ని పోలి ఉండేలా బస్సును తీర్చిదిద్దారు. బస్సులోనే బస చేసేలా.. బస్సు మీదనుంచి ప్రసంగించేలా.. అన్ని వసతులతో డిజైన్ చేస్తున్నారు. ఎక్కడా హైటెక్ హంగులకు వెళ్లకుండా.. సింపుల్ గా ఉండేలా.. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లతో బస్సును తయారు చేయించారు.

‘వారాహి’ వాహనాన్ని ప్రత్యేక భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వాహనంపై, వాహనం చుట్టూ లైట్లు ఏర్పాటు చేశారు. ఆధునిక సౌండ్‌ సిస్టం ఫిట్ చేశారు. వారాహికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. వాహనం దగ్గర రికార్డయ్యే ఫుటేజ్‌.. రియల్‌ టైమ్‌లో సర్వర్‌కి చేరుతుంది.

గతంలో పెద్ద ఎన్టీఆర్ చైతన్య రథంపై ఆంధ్ర దేశాన్ని సుడిగాలిలా చుట్టేసి.. పార్టీ పెట్టిన 8 నెలల్లోనే అధికారంలోకి రాగలిగారు. అన్నగారే స్పూర్తిగా.. చైతన్యరథాన్ని పోలి ఉండేలా.. పవన్ కల్యాణ్ సైతం అలాంటి భారీ వాహనాన్నే సెలెక్ట్ చేసుకున్నారు. వాహనాన్ని చూడగానే దేశభక్తి రగిలేలా.. మిలట్రీ కలర్ లో ‘వారాహి’ ని రెడీ చేయించారు. వారాహిపై ఏపీ వ్యాప్తంగా బస్సుయాత్రతో ఎన్నికల జైత్రయాత్రకు సిద్దమవుతున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రచార వాహనానికి ప్రత్యేక పూజలు చేయించనున్నారు పవన్ కల్యాణ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News