Big Stories

Reduce Fat : ఈ కూరగాయలు తింటే కొవ్వు తగ్గడం ఖాయం

Reduce Fat : అధిక శరీర కొవ్వు అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు మరీ ప్రమాదకరం. పొట్ట దగ్గరి కొవ్వు గుండె జబ్బులతో పాటు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది.

- Advertisement -

అంతేకాకుండా రక్తపోటును కూడా ప్రభావితం చేస్తుంది. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు రక్తంలో అధిక చక్కెర స్థాయిల‌ను కూడా పెంచుతుంది. దీంతో జీర్ణక్రియ సరిగా జరగదు. అంతేకాకుండా హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అందుకే పొట్ట దగ్గరి కొవ్వుకు కరిగించుకోవాలి. కొన్ని కూరగాయలను తీసుకుంటే పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. పాల‌కూరలో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇది కొవ్వును క‌రిగించే గుణాలను కలిగి ఉంటుంది. పాల‌కూరను ఉడికించి లేదా నేరుగా కూడా తిన‌వ‌చ్చు. ఇది అదనపు కొవ్వును క‌రిగించడానికి, ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా ఉపయోగపడుతుంది. బ్రోకలీలో అధికంగా పీచు ప‌దార్థం ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు సంవృద్ధిగా ఉంటాయి. బ్రోకోలీలో కొవ్వుతో పోరాడే ఫైటోకెమికల్స్ కూడా లభిస్తాయి. ఇందులోని ఫోలేట్ మీ శరీర భాగాల చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. క్యారెట్లలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. వీటిలోని ఫైబ‌ర్ పొట్ట ద‌గ్గరి కొవ్వును కరిగిస్తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ప్రతిరోజు క్యారెట్లను తినాలి. కీర‌దోస‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా శ‌రీరంలోని వ్యర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

- Advertisement -


వీటిని తిన‌డంవ‌ల్ల శ‌రీరానికి అధికమొత్తంలో ఫైబ‌ర్ అందుతుంది. అంతేకాకుండా ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. అలాగే స్థూల‌కాయం రాకుండా చూస్తుంది. పొట్ట ద‌గ్గర కొవ్వు ఎక్కువగా ఉంటే ఈ కూరగాయలను తీసుకోవడంతో పాటు మ‌ద్యం సేవించ‌డం, పొగ తాగ‌డంలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. జంక్‌ ఫుడ్‌ తీసుకోకూడదు. తగినంత నిద్రకూడా పోవాలని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News