E-Paper
Advertisement

Ustaad Bhagat Singh Poster: పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం వేళ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్!

Ustaad Bhagat Singh Poster: పవర్ స్టార్ ప్రమాణ స్వీకారం వేళ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ నుంచి అదిరిపోయే పోస్టర్ రిలీజ్!
Advertisement

Pawan Kalyan’s New Poster from Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవర్ కల్యాణ్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నాడు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్ బిజీ అయిపోవడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఇక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీ ఓట్లతో గెలిపొందాడు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు ‘కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను’ అని అంటాడా అని వేయి కళ్లతో సినీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఎదురుచూశారు. ఇవాళ ఆ రోజు రానే వచ్చింది.

ఇవాళ ఏపీలోని కేసరపల్లిలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ నోటివెంట ‘పవన్ కల్యాణ్ అనే నేను’ మాట వినగానే సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది. ఈ మాట కోసం ఎన్నో ఏళ్లనుంచి ఎదురుచూసిన జనసేన సైనికులు, సినీ అభిమానుల కోరిక ఈరోజుతో నెరవేరింది. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్‌కు ఉదయం నుంచి ప్రముఖులందరూ కంగ్రాట్స్ తెలుపుతున్నారు.

Advertisement

అంతేకాకుండా పవన్ చేస్తున్న సినిమాల నుంచి కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పవన్‌కు కంగ్రాట్స్ తెలుపుతూ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ టీమ్ అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుక్‌లో కనిపించి అదరగొట్టేశాడు.

Also Read: “గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం”.. పూనకాలు తెప్పిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్

Advertisement

పోలీస్ యూనిఫాం వేసుకొని చేతిలో సుత్తి పట్టుకుని ఉన్న స్టిల్స్ సూపర్‌గా ఉంది. ఈ పోస్టర్‌లో ‘‘ సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే’’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌తో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుంది. ఇందులో పవర్ స్టార్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.

టాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ కోలీవుడ్‌లో విజయ్ సేతుపతి నటించిన ‘తేరి’ సినిమాకు రీమెక్. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Allu Arjun: పవన్ తో క్లాష్.. నీకు పనికిరాదు బన్నీ.. చూసుకో మరి.. ?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×