BigTV English
Advertisement

Hazelnut Health Benefits: డయాబెటిస్ ఉన్న వాళ్లు.. హాజెల్ నట్స్ తింటే ఎంత మంచిదో..

Hazelnut Health Benefits: డయాబెటిస్ ఉన్న వాళ్లు.. హాజెల్ నట్స్ తింటే ఎంత మంచిదో..

Health Benefits of Hazelnuts Nutritional Facts and Uses: మనకి ఆరోగ్యాన్ని అదించే అన్ని డ్రైఫ్రూట్స్ లో హాజెల్ నట్స్ కూడా ఒకటి. హాజెల్ నట్స్ కొంచెం తీపి, పసుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. ఇవి అనేక వ్యాధులు నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇందులో హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, మినరల్స్ మొదలైనవి పుష్కలంగా లభిస్తాయి. హాజెల్ నట్స్ గురించి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.


హాజెల్ నట్స్  ప్రయోజనాలు
హాజెల్ నట్స్‌లో ఒలియిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది. హాజెల్ నట్స్ లో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. హాజల్ నట్స్ లో డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది.

ఎముకలను బలంగా ఉంచుతాయి
హాజెల్ నట్స్ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. హాజెల్ నట్స్‌లో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి చాలా ఉపయోగపడతాయి.


Also Read: Obesity Health Tips: అధిక బరువుతో అనారోగ్య సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చక్కెరను అదుపులో ఉంచుతాయి
రెగ్యులర్ గా హాజెల్ నట్స్ తీసుకోవడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. దీనితో పాటు హాజెల్ నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ఉపయోగపడతాయి. అందువల్ల డయాబెటిస్ ఉన్న వారు రెగ్యులర్ హాజెల్ నట్స్ తీసుకుంటే చాలా బెటర్.

వాపు సంబంధిత సమస్యల నుండి కాపాడుతుంది

వాపు సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా హాజెల్ నట్స్ చాలా మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణులు సమాచారం ప్రకారం.. హాజెల్ నట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా, వాపుకు సంబంధించిన అనేక సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇది కాకుండా క్రానిక్ డిసీజ్ లు రాకుండా హెల్ప్ చేస్తాయి.

Tags

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×