E-Paper
Advertisement

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ OGలో హీరోయిన్‌గా చెన్నై బ్యూటీ

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ OGలో హీరోయిన్‌గా చెన్నై బ్యూటీ
Advertisement
Pawan Kalyan

Pawan Kalyan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, సుజిత్ కాంబినేష‌న్‌లో ఓ సినిమాగా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ట్రిపుల్ ఆర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను చేసిన నిర్మాత డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన రోజు నుంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగిపోతున్నాయి.ఈ సినిమాకు ఓజీ (OG) అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నారు. అందుకు కార‌ణం అదే టైటిల్‌ను దానయ్య అన్ని భాష‌ల్లో రిజిష్ట‌ర్ కూడా చేయించారు. OG పోస్ట‌ర్ మీద జ‌ప‌నీస్ లాంగ్వేజ్ కూడా ఉండ‌టంతో క్రేజ్ పెరిగిపోతుంది. OG అంటే ఒరిజిన‌ల్‌ గ్యాంగ్ స్ట‌ర్ మూవీ అని అంద‌రూ అనుకున్నారు.

గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ అంటే సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లా అల‌రిస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. లేటెస్ట్‌గా ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటే హీరోయిన్ ఫిక్స్ అని. ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రో కాదు.. చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సినీ సర్కిల్స్ సమాచారం.

Advertisement

అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సుజిత్ కాంబినేష‌న్‌లో రాబోతున్న సినిమా ఫైట్స్‌, పాట‌లు ఉండ‌బోవంటూ టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో పాట‌లు, ఫైట్స్ ఉండ‌వంటే అది ఫ్యాన్స్‌ని మెప్పిస్తుందా? అనేది అంద‌రిలో మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌. ఇలాంటి ఎక్స్‌పెరిమెంట‌ల్ మూవీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏవిధంగా మెప్పిస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఆయన వినోద సిత్తం తమిళ రీమేక్‌తో పాటు హరి హర వీర మల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×