E-Paper
Advertisement

Pawan Kalyan Movie Update: పవన్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఆ సినిమాలపై క్రేజీ అప్డేట్!

Pawan Kalyan Movie Update: పవన్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. ఆ సినిమాలపై క్రేజీ అప్డేట్!
Advertisement

Pawan Kalyan Movie HariHara Veeramallu Update: పవర్ స్టార్ అభిమానులకు మేకర్స్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. పవన్ కల్యాణ్..ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమితో కలిసి అఖండ విజయం సాధించింది. దీంతో పవన్ కల్యాణ్ పలు కీలక బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ సీఎంగా అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తరుణంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేస్తారా.. చేయరా అనే చర్చ సినీ పరిశ్రమలో జోరుగా సాగుతోంది.

పవన్ కల్యాణ్ శనివారం తెలంగాణలోని జగిత్యాలలో కొండగట్టు ఆంజనేయుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, జులై 1 నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇలా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ప్రజా సేవలో బిజీబిజీగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన నటిస్తున్న సినిమాలపై మేకర్స్ అప్డేట్ ప్రకటించారు.

Advertisement

పవన్ కల్యాణ్ గతంలో సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేసి రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించే ఆలోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది. ఎన్నికలకు ముందు సినిమాలకు చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు ప్రారంభించిన సినిమాల్లో ‘హరహర వీరమల్లు’ ఒకటి. ఈ మూవీ అనౌన్స్ చేసి ఏళ్లు గడుస్తున్నా..ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఎట్టకేలకు ఈ సినిమాపై మేకర్స్ క్రేజీ అప్డేట్ ప్రకటించి అభిమానులకు శుభవార్త చెప్పారు.

‘హరహర వీరమల్లు’ మూవీ నిర్మాత ఎ.ఎం రత్నం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘హరహర వీరమల్లు’లో పవన్ కల్యాణ్ షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇంకో 20 నుంచి 25 రోజులు ఆయన షూటింగ్ చేస్తే మూవీ పూర్తవుతోంది. ప్రజా సేవలో బిజీగా ఉండడంతో ఆయన వీలును బట్టి త్వరలోనే పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ‘హరహర వీరమల్లు’ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకుంది. వారి అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమా అక్టోబర్‌లో విడుదల కావాలి. కానీ వాళ్లను రిక్వెస్ట్ చేసి విడుదల తేదీని కాస్త వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని.’ నిర్మాత చెప్పారు.

Advertisement

Also Read: రెండు జడలు వేసుకొని హొయలు పోతున్న ఈ అక్కాచెలెళ్లు.. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు.. ఎవరో గుర్తుపట్టండి

అదే విధంగా ఈ ఏడాదిలోనే సినిమాను ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నామని, డిసెంబర్‌లో విడుదల చేసే విధంగా చూస్తామని నిర్మాత చెప్పారు. అయితే ఈ మూవీకి మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా.. ఇప్పుడు ఆయన బిజీ ఉండడంతో క్రిష్ పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నారు. మెగా సూర్య మూవీస్ పతాకంపై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×