BigTV English

Polavaram Project: ప్రభుత్వ శ్వేతపత్రం విడుదలతో వైసీపీలో కలవరం.. అంబటి అర్థంలేని ఎదురుదాడి

Polavaram Project: ప్రభుత్వ శ్వేతపత్రం విడుదలతో వైసీపీలో కలవరం.. అంబటి అర్థంలేని ఎదురుదాడి

Ambati Rambabu fires on CM Chandrababu and TDP Leaders over Polavaram White Paper: ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రాలను విడుదల చేయడం మొదలు పెట్టింది. శాఖల వారీగా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచేందుకు రెడీ అయింది. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ పెట్టనుంది. ఈ లోపు రాష్ట్ర ఆర్థిక స్థితిగతలు, అప్పులు, ఆస్తుల విలువ ప్రజలు ముందు పెట్టాలని చంద్రబాబు భావించారు. ఇందులో భాగంగానే వైట్ పేపర్స్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరంపై వైట్ పేపర్ విడుదలతోనే వైసీపీ అధిష్టానంలో కలవరం మొదలైంది. టీడీపీ హయాంలో 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే.. వైసీపీ హయాంలో 3 శాతంలోపే నిర్మాణాలు జరిగాయని తెలిపారు.


అంతేకాదు.. జగన్ నిర్లక్ష్యం వలన డయాఫ్రం వాల్ ధ్వంసమైందని.. పోలవరం నిధులు వైసీపీ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని చెప్పారు. దీంతో.. వైసీపీ నేతలు ఎదురుదాడి మొదలు పెట్టారు. అందులోనూ అంబటి రాంబాబు వైసీపీ ప్రభుత్వాన్ని సమర్థించుకొని.. టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేశారు. జాతీయ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకో చెప్పాలని చంద్రబాబుని అంబటి ప్రశ్నించారు. ఇదే విషయాన్ని 2014 నుంచి వైసీపీ ప్రస్తావిస్తుంది. కేంద్రం నిర్వహిస్తున్న జాతీయ ప్రాజెక్టుల నిర్మాణాలు ఎదుగు బొదుగు లేకుండా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14 జాతీయ ప్రాజెక్టులు దశాబ్దాలుగా నిర్మిస్తున్నా.. 10 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. విభజనతో ఆర్థికంగా నష్టపోయిన ఏపీలో పోలవరం పూర్తి అయితే.. రైతులు ఆర్థికంగా స్థిరపడతారు.

కాబట్టి పోలవరం నిర్మాణం కేంద్రానికి వదిలేస్తే.. వందేళ్లు అయినా అది పూర్తి అవుతుందా అంటే అనుమానమే. అందుకే.. 2014 తర్వాత చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అలా తీసుకున్నారు కాబట్టే.. 72 శాతం పూర్తి చేయగలిగారు. ఇవన్నీ వైసీపీ నేతలకు కూడా తెలుసు.. కానీ, రాజకీయంగా లబ్ధి పొందాలని జాతీయ ప్రాజెక్టును రాష్ట్ర ఎందుకు తీసుకుందని ప్రశ్నిస్తున్నారు. పోలవరం నిధులు పక్కదోవ పట్టించడానికే చంద్రబాబు అలా చేశారని వైసీపీ నేతలు విమర్శింస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు కేంద్రమే నిర్మించాలని వ్యాఖ్యలు చేసిన వైసీపీ.. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పోలవరాన్ని కేంద్రానికి తిరిగిచ్చేయలేదో అంబటి రాంబాబు చెప్పాలి. అంతేకాదు.. అంబటి రాంబాబు మరో విమర్శ కూడా చేశారు.


Also Read: ఏపీలో పెన్షన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

చంద్రబాబుకు పోలవరాన్ని నిర్మించే ఉద్దేశ్యం లేదని.. అందుకే వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే.. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో తనకు తెలియదని.. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడని అంబటి రాంబాబు.. టీడీపీని విమర్శించడం కాస్త విడ్డూరంగానే. పోలవరం అనేది అర్థంకాని సబెక్ట్ అని.. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టమని.. అందుకే అది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని అన్న వైసీపీ నేతలకు.. అదే పోలవరంపై ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం మాత్రం బాగా తెలుసు.

వైసీపీ హయాంలో కనీసం మూడు శాతం పనులు కూడా చేయకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే నిర్మాణం ఎప్పుడు చేస్తారో చెప్పాలని అంబటి లాంటి వాళ్లు డిమాండ్ చేయడం ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు. మాజీ సీఎం జగన్, జలవనరులు శాఖ మంత్రులుగా పని చేసిన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు పోలవరం పూర్తి చేస్తామని సుమారు 10 డేట్లను మార్చారు. చివరికి అంబటి రాంబాబు.. జలవనరుల శాఖ మంత్రిగా ఉంటూ పోలవరం గురించి తనకు తెలియదని చెప్పి ఆ ప్రాజెక్టు కథను ముగించారు. ఇలాంటి వాళ్లు టీడీపీని విమర్శిస్తున్నారు.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×