Big Stories

Pawan Kalyan: మేన‌ల్లుడితో షూటింగ్ షురూ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

Pawan Kalyan:ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్‌లో బుధ‌వారం నుంచి పాల్గొంటున్నారు. త‌మిళ చిత్రం వినోద‌య సిత్తంకు ఇది రీమేక్‌. త‌మిళంలో న‌టుడు, ద‌ర్శ‌కుడైన స‌ముద్ర‌ఖ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తూ తెర‌కెక్కించారు. ఇప్పుడు దాన్నే తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌కి స‌ముద్ర ఖని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

- Advertisement -

వినోద‌య సిత్తంలో స‌ముద్ర ఖ‌ని చేసిన పాత్ర‌ను తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేస్తున్నారు. కోలీవుడ్‌లో తంబి రామ‌య్య పాత్ర‌ను తెలుగులో సాయిధ‌ర‌మ్ తేజ్ చేస్తున్నారు. తంబి రామ‌య్య పాత్ర‌ను తెలుగులో పూర్తిగా చేంజ్ చేసేశారు. సాయిధ‌ర‌మ్ పాత్ర‌కు హీరోయిన్ ఉంటుంది. దాని బ్యాక్ డ్రాప్‌ను పూర్తిగా మార్చేసిన‌ట్లు తెలుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్నేహితుడైన త్రివిక్ర‌మ్‌.. ఈ సినిమాకు మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.

- Advertisement -

బిజీ లైఫ్‌లో మ‌నిషి ప‌రులుగు తీస్తూ త‌న చుట్టూ ఉన్న వారిని, వారి ప్రేమ‌ను మ‌ర‌చిపోతున్నాడు. అలాంటి ఓ వ్య‌క్తి జీవితంలో దేవుడు అనుకోని ప‌రిస్థితుల్లో ప్ర‌వేశించి జీవితం గొప్ప‌తనాన్నిఅర్థ‌మ‌య్యేలా ఎలా చెప్పాడ‌నేదే క‌థాంశం. ఈ సినిమా కంటే ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు సినిమాలను స్టార్ట్ చేశారు. అందులో ఒక‌టి హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా. ఈ రెండు సినిమాల కంటే లేట్‌గా స్టార్ట్ చేసిన వినోదయ సిత్తం రీమేక్ సినిమాను ప‌వన్ సెట్స్ పైకి తీసుకెళ్లారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Astrologer Venu Swamy:తార‌క‌ర‌త్న చ‌నిపోతాడ‌ని ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామికి ముందే తెలుసా?

Pathaan: టాప్ 5లో ‘పఠాన్’… మ్యాజిక్ చేసిన షారూఖ్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News