BigTV English

Teachers Affair: ఇద్దరు టీచర్ల అక్రమ సంబంధం.. కట్టేసికొట్టిన పోలీస్ మొగుడు..

Teachers Affair: ఇద్దరు టీచర్ల అక్రమ సంబంధం.. కట్టేసికొట్టిన పోలీస్ మొగుడు..

Teachers Affair: వాళ్లిద్దరు టీచర్లు. విద్యాబుద్దులు చెప్పాల్సిన వాళ్లు. కానీ, బుద్ధిలేని పని చేస్తున్నారు. సభ్యసమాజం సిగ్గుపడే చండాలానికి అలవాటుపడ్డారు. కొంతకాలంగా సాగుతోంది ఇద్దరు టీచర్ల మధ్య అక్రమ సంబంధం. విషయం తెలిసి ఆ మహిళా టీచర్ భర్త ఓసారి వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా, యవ్వారం ఆపలేదు. ఈసారి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని.. కట్టేసి.. చితక్కొట్టాడు. పోలీసులకు అప్పగించాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ మహిళా టీచర్ భర్త పోలీస్ కానిస్టేబుల్ కావడం. ఇంతకీ మేటర్ ఏంటంటే…


ఉమ్మడి వరంగల్ జిల్లా మంగపేట మండలంలో జరిగిందీ ఘటన. స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. మరో ఉపాధ్యాయురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

భర్త మహబూబాబాద్‌లో. భార్య మంగపేటలో. ఇంకేం అదే స్కూల్లో పని చేసే టీచర్ నాగేందర్ తగులుకున్నాడు. అతను అప్పటికే ఇద్దరు భార్యలను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు. ఈమెను లైన్లో పెట్టాడు. భర్త వేరే చోట ఉంటుండటంతో.. వారిద్దరి మధ్య ఎఫైర్ చాలా ఈజీగా సాగిపోయింది. కొన్నాళ్లకి సెలవు రోజుల్లో ఇంటికి వచ్చే భర్తను పెద్దగా పట్టించుకోవడం మానేసింది. అదేంటి. నా భార్య నన్ను కేర్ చేయడం లేదని ఆ కానిస్టేబుల్ భర్తకు డౌట్ వచ్చింది. అసలే పోలీస్ కదా. ఆరా తీస్తే.. భార్య రంకు రట్టు అయింది.


విషయం తెలిసిన వెంటనే స్కూల్‌కి వెళ్లి గొడవ చేశాడు. తన భార్యకు దూరంగా ఉండాలని నాగేందర్‌కు వార్నింగ్ ఇచ్చాడు. స్కూల్ HMకి ఫిర్యాదు చేశాడు. దీంతో, ఆ ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. ఇక వారిద్దరి రిలేషన్‌కు బ్రేక్ పడుతుంది అనుకున్నాడు భర్త. కానీ, అలా జరగలేదు. అలవాటు పడిన యవ్వారం కదా.. మళ్లీ మళ్లీ కలుస్తున్నారు ఆ ఇద్దరు టీచర్లు. ఈ విషయం ఆ భర్తకు తెలీదు.

ఇటీవల ఎప్పటిలానే ఇంటికొచ్చాడు భర్త. మిడ్ నైట్ 2 గంటలకు భార్య ఫోన్ రింగ్ అయింది. వెంటనే లేచిన భర్త.. ఆ ఫోన్ లిఫ్ట్ చేశాడు. ‘నేను వస్తున్నా, తలుపు తీసి ఉంచు’ అని చెప్పి అటువైపు కాల్ కట్ అయింద. ఆ ఫోన్ చేసింది నాగేందరే అని ఆ భర్త ఫిక్స్ అయ్యాడు.

వారిద్దరినీ ఎలాగైనా పట్టుకోవాలని డోర్ తీసి ఉంచి.. బాత్రూంలో దాక్కున్నాడు భర్త. అనుకున్నట్టుగానే కాసేపటికే నాగేందర్‌ ఇంట్లోకి వచ్చాడు. అలర్ట్ అయిన ఆ కానిస్టేబుల్ భర్త.. వెంటనే బయటికెళ్లి డోర్ పెట్టేశాడు. తెల్లారాక ఇరుగుపొరుగు వాళ్లను పిలిచాడు. వారిద్దరినీ తాళ్లతో కట్టేసి.. కసితీరా చితక్కొట్టేశాడు. కోపం తగ్గాక.. తీరిగ్గా పోలీసులకు ఫోన్ చేసి వారిద్దరినీ అప్పగించాడు. ఆ భర్త కూడా పోలీస్ కావడంతో.. స్టేషన్లో ఆ టీచర్‌కి ఎలాంటి పోలీస్ మర్యాదలు చేస్తున్నారో?

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×