E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అన్నది అల్లు అర్జున్ గురించేనా..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అన్నది అల్లు అర్జున్ గురించేనా..!
Advertisement

Pawan Kalyan – Pushpa: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా కర్ణాటక వెళ్లారు. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యాతో భేటీ అయ్యారు. అడవుల రక్షణ, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం కర్ణాటక రాష్ట్ర అటవీ శాఖ మంత్రితో పవన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్‌ లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో అటవీ పరిరక్షణ కోసం తీసుకోవలసిన కొన్ని అంశాలపై మాట్లాడారు.

ఈ సందర్భంగా బెంగళూరులోనే ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులో పవన్ కళ్యాణ్ సినిమా హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనే విషయానికొస్తే.. 40 ఏళ్ల క్రితం హీరో అడవులను కాపాడేవాడని.. కానీ ఇప్పుడు అడవులను నరికి స్మగ్లింగ్ చేస్తేనే హీరో అని అంటున్నారని అన్నారు. ఇది ప్రస్తుతం మన సినిమాల పరిస్థితి అని ఈ 40 ఏళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం అంటూ మాట్లాడారు.

Advertisement

Also Read: భన్వర్ సింగ్ షెకావత్ బర్త్ డే పోస్టర్ అదిరింది

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి. అల్లు అర్జున్ పుష్ప సినిమాను ఉద్దేశించే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమల్లో ‘పుష్ప’ మూవీనే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ‘పుష్ప రాజ్’ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తుంటాడు. అందువల్లనే అల్లు అర్జున్‌ని టార్గెట్ చేసి పవన్ ఈ వ్యాఖ్యలు చేశారని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

40 ఏళ్ల క్రితం హీరోలు అడవులను రక్షించేవారు అంటే అప్పట్లో ఎన్టీఆర్, కృష్ణంరాజు వంటి హీరోలు అడవుల పరిరక్షణ, ఎర్రచందనం స్మగ్లింగ్ నిర్మూలించడం వంటి నేపథ్యంలో సినిమాలు చేశారు. ఇప్పుడు పుష్ప మూవీ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఇందులో హీరోనే స్మగ్లింగ్ చేస్తుంటాడు. అందువల్ల ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన విషయం ఏమీ లేదని.. పవన్ కళ్యాణ్ కచ్చితంగా బన్నీ గురించే అన్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×