BigTV English

Pushpa 2: భన్వర్ సింగ్ షెకావత్ బర్త్ డే పోస్టర్ అదిరింది

Pushpa 2: భన్వర్ సింగ్ షెకావత్ బర్త్ డే పోస్టర్ అదిరింది

Pushpa 2: పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఇండస్ట్రీ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 6 న రిలీజ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. గత కొన్నిరోజులుగా అల్లు అర్జున్ కు సుకుమార్ కు మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సమస్యలు తొలిగిపోయి పుష్ప 2 సెట్స్ మీదకు వెళ్లినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు.

ఇక ఈ చిత్రంలో స్పెషల్ ఎట్రాక్షన్ అంటే భన్వర్ సింగ్ షెకావత్ అని చెప్పాలి. ఆ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కనిపించాడు. పార్టీ లేదా పుష్ప అన్న ఒక్క డైలాగ్ తో ఫహాద్ పాన్ ఇండియా రేంజ్ గుర్తింపును అందుకున్నాడు. ఇక సెకండ్ పార్ట్ లో కూడా భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంట.


తాజాగా నేడు ఫహాద్ పుట్టినరోజు కావడంతో.. పుష్ప 2 నుంచి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి బర్త్ డే విషెస్ తెలిపారు. ఇక ఈ పోస్టర్ లో భన్వర్ సింగ్ షెకావత్.. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. లుంగీ కట్టుకొని.. పైన పోలీస్ షర్ట్ వేసుకొని..  ఒక చేత్తో గన్ పట్టుకొని.. ఇంకోచేత్తో గొడ్డలి పట్టుకొని సీరియస్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి పుష్పకు భన్వర్ సింగ్ షెకావత్ మధ్య యుద్ధం వేరే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. మరి పుష్ప 2 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×