BigTV English

Viral News: ఎంగేజ్‌మెంట్‌ కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన జంట.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

Viral News: ఎంగేజ్‌మెంట్‌ కోసం స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టిన జంట.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

Viral News: ప్రస్తుతం ఉన్న పద్ధతులకు పూర్వం ఉన్న పద్ధతులకు చాలా తేడా ఉండేది. ఒకప్పుడు అయితే కుటుంబంతో కలిసి బయటికి వెళ్లడం, పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటివి ఉంటేనే సాధ్యం అయ్యేది. అప్పట్లో ఖర్చులు కూడా ఎక్కువగా ఉండేవి కావు. ఉన్న వాటితో సర్దుకుంటూ ఏదైనా కొత్తగా తినాలన్నా, షాపింగ్ చేయాలన్నా కూడా సంవత్సరంలో వేళ్లపై లెక్కపెట్టేన్ని సార్లు మాత్రమే చేస్తుండేవారు. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవనశైలి కూడా పూర్తిగా మారిపోతుంది. ఎప్పుడు పడితే అప్పుడూ వెకేషన్లు, టూర్స్, ఫంక్షన్లు, డిన్నర్ అంటూ ఏదో ఒక విధంగా ప్రయాణాలు చేస్తున్నారు.


టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ కాలంలో ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా కూడా శ్రమించాల్సి పని లేకుండా పోతుంది. షాపులకు వెళ్లి కొనుగోలు చేయడం సాధ్యం కాని సమయంలో ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసుకునే చాలా రకాల ఈ కామర్స్ ప్లాట్ ఫాంలు అందుబాటులోకి వచ్చాయి. వస్తువులే కాదు భోజనం కూడా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చనే విషయం తెలిసిందే. అయితే ఇలా కేవలం ఇంట్లో కోసం, లేదా ఫ్రెండ్స్ తో ఏదైనా చిన్న పార్టీలు ఉన్నప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ తాజాగా ఓ పెళ్లి జంట ఏకంగా తమ ఎంగేజ్మెంట్ కోసం ఆన్ లైన్ ద్వారా భారీ మొత్తంలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది.

తమ నిశ్చితార్థం కోసం పెళ్లి జంట ఫుడ్ ఆర్డర్ పెట్టిన ఫోటోలను ఈ మేరకు స్విగ్గీ ఎక్స్ వేదికగా అందరితో పంచుకుంది. భారీ మొత్తంలో తమ నుంచి పెళ్లి జంట ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం పట్ల స్విగ్గీ ఆకస్తికర ట్వీట్ చేసింది. ఇలాంటి చాలా రకాల సదుపాయాలు మా వద్ద ఉన్నా కూడా దీనిని ఉపయోగించుకోవడం లేదని, ప్రస్తుతం ఈ జంట తమ సేవలను ఉపయోగించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు స్విగ్గీ డెలివరీ బాయ్ ఫుడ్ బాక్స్ లను డెలివరీ చేసిన ఫోటోలతో ట్వీట్ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.


Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×