E-Paper
Advertisement

NTRNeel : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని లీకులే, ఈ కష్టం శత్రువుకి కూడా రాకూడదు

NTRNeel : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని లీకులే, ఈ కష్టం శత్రువుకి కూడా రాకూడదు
Advertisement

NTRNeel : కే జి ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ప్రశాంత్ నీల్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత దానికి సీక్వల్ గా వచ్చిన కే జి ఎఫ్ 2 సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

ఇక ప్రస్తుతం తెలుగు హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సినిమా సలార్. బాహుబలి సినిమా తరువాత సరైన సక్సెస్ లేదు అనుకునే టైంలో ఈ సినిమా వచ్చింది. దాదాపుగా 500 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది సలార్. అంత అద్భుతంగా ఈ సినిమాను డిజైన్ చేశాడు ప్రశాంత్ నీల్.

Advertisement

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా లీకులు 

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటించలేదు. జపాన్ ఈవెంట్లో ఒక ఇంటర్వ్యూలో అనుకోకుండా ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమా పేరును డ్రాగన్ అని రివీల్ చేశాడు. చిత్ర యూనిట్ ఇచ్చిన అప్డేట్స్ కంటే కూడా, బయట వాళ్ళు ఈ సినిమా గురించి ఎక్కువగా లీక్ చేస్తున్నారు. అయితే లీక్ చేస్తుంది సెలబ్రిటీలు అవడం ఇంకా ఆశ్చర్యం.

Advertisement

రాజమౌళి ఏమో డ్రాగన్ టైటిల్ అని చెప్పేసాడు. పృధ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టవేనో థామస్, బీజూ మీనన్ ఉంటారు అని చెప్పేసాడు. ఏఆర్ మురుగదాసు దర్శకత్వంలో శివ కార్తికేయ నటిస్తున్న సినిమా మదరాసి ఆ సినిమా తెలుగు ఈవెంట్ లో ప్రొడ్యూసర్ మాట్లాడుతూ రుక్మిణి వసంత్ హీరోయిన్ అని కన్ఫామ్ చేశారు. దీనిని బట్టి చూస్తుంటే చాలామంది సెలబ్రిటీలు ఈ సినిమా గురించి ఎక్కువ లీక్స్ ఇస్తున్నారు.

ఏమి చేయలేని పరిస్థితి 

మామూలుగా తమ సినిమాకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ బయటకు రిలీజ్ చేస్తే చిత్ర యూనిట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్ ఉంటుంది. కానీ ఇప్పుడు సెలబ్రిటీలు లీక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ల మీద సరైన యాక్షన్ తీసుకోలేరు. అంతేకాకుండా ఆయా సెలబ్రిటీలు కూడా కావాలి అని కాకుండా తమకు తెలియకుండానే ఈ సినిమా గురించి చాలా విషయాలను చెప్పేస్తున్నారు. దీని విషయంలో చిత్ర యూనిట్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది అని అర్థమవుతుంది. మొత్తానికి ఈ సినిమా మీద అయితే మంచి అంచనాలు ఉన్నాయి. చాలావరకు ఈ సినిమా కోసం బరువు తగ్గాడు ఎన్టీఆర్.

Also Read: Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్

Related News

కృష్ణాష్టమి రోజున కల నెరవేరిందంటున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

Big Stories

Advertisement
×