BigTV English

Nag Ashwin: కల్కి లో ఆ స్టార్లు కలెక్షన్స్ కోసం కాదు… అయ్యో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరువు తీశాడే!

Nag Ashwin: కల్కి లో ఆ స్టార్లు కలెక్షన్స్ కోసం కాదు… అయ్యో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరువు తీశాడే!

Nag Ashwin: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన బాహుబలి(Baahubali) సినిమా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది. ఇక త్రిబుల్ ఆర్ (RRR) సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఆడింది. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.


తెలుగు సినిమా ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేర్లలో కల్కి సినిమా కూడా ఒకటి ఉంటుంది. ప్రభాస్ (Prabhas) కెరియర్ లో రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి. అందులో కల్కి (Kalki) కూడా ఒకటి. పోతే కల్కిలో ప్రభాస్ తో పాటు చాలామంది స్టార్స్ కనిపించారు. అమితా బచ్చన్ (Amitabh Bachchan), దుల్కర్ సల్మాన్ (dulquar Salman), దీపికా పదుకొనే (Deepika Padukone) వంటి స్టార్స్ నటించారు. అయితే వీళ్ళందరూ కథలో కీలకపాత్రలు. వీళ్లు కాకుండా సినిమాలో ఇంకొన్ని పాత్రలు ఉన్నాయి. వాటి గురించి నాగ్ అశ్విన్ రియాక్ట్ అయ్యారు.

కలెక్షన్ల కోసం కాదు 


అంతమంది స్టార్లను ఎందుకు పెట్టుకున్నారు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ కోసమా అని నాగ్ అశ్విన్ ను ఒక యాంకర్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో అడిగారు. దానికి సమాధానంగా నాగ అశ్విన్ మాట్లాడుతూ నేను బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి ఏ రోజు స్టార్స్ ను పెట్టను. నేను ఒక ఆడియన్ లా సినిమాను ఎంజాయ్ చేస్తాను. అలానే ఆలోచిస్తాను. ఉదాహరణకు సినిమాలో రాంగోపాల్ వర్మాను చూసినప్పుడు నేను అరుస్తున్నాను. థియేటర్లో చాలామంది అరిచారు. ఒక మంచి ఫన్ క్రియేట్ అయింది. అలానే రాజమౌళి మరియు ప్రభాస్ మధ్య కొన్ని సీన్స్ కూడా మంచి ఫన్ క్రియేట్ అయింది. కేవలం ఫన్ కోసమే నేను ఆ స్టార్స్ ను పెట్టను తప్ప బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం కాదు. అలానే సినిమాలు అనుదీప్ (anudeep KV) కనిపించినప్పుడు కూడా చాలామంది విపరీతంగా అరిచారు.

కల్కి 2 గురించి నాగ్ అశ్విన్

చాలామంది ఎంతో ఆసక్తితో కల్కి 2 సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. అలానే పార్ట్-2 కు సంబంధించి చాలా విషయాలను నాగ్ అశ్విన్ దాచి ఉంచాడు. అయితే దీని గురించి నాగ అశ్విన్ మాట్లాడుతూ ముందుగా మైక్ పని చేయట్లేదు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ కి మొదలు పెట్టనున్నట్లు ఆలోచన ఉంది అని తెలిపారు.

Also Read: Lokesh kanagaraj : ఫ్యూచర్ లో అతను లేకుండా సినిమా చేయను, లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్

Related News

OG Trailer Update: ఓజీ ట్రైలర్ ఎప్పుడంటే? మరీ అంత లేటా?

NTRNeel : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని లీకులే, ఈ కష్టం శత్రువుకి కూడా రాకూడదు

Mirai Film: మిరాయ్ సినిమాలో రాముడిగా  స్టార్ హీరో… థియేటర్లు తగలబడి పోవాల్సిందే?

Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్

Lokesh kanagaraj : ఫ్యూచర్ లో అతను లేకుండా సినిమా చేయను, లోకేష్ కనగరాజ్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్

Big Stories

×