OG Trailer Update: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే పండగ వాతావరణం ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సినిమాల మీద ఆసక్తి ఎలా అయితే తగ్గిపోయిందో, చాలామందికి పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆసక్తి తగ్గిపోయింది అనేది కూడా వాస్తవం. హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ దగ్గరుండి ప్రమోషన్ చేయటం వల్ల మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. లేకుంటే ఆ సినిమా అంతంత మాత్రమే ఆడేది.
హరిహర వీరమల్లు సినిమా విషయంలో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంప్లీట్ నిరాశలో మునిగిపోయారు. అయితే వాళ్లందరికీ ఓ జి సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా పలు సందర్భాలలో వాయిదా పడుతూ వచ్చింది.
ట్రైలర్ రిలీజ్ అప్పుడే
ఓ జి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానుల మెంటల్ హెల్త్ ను ఈ మంత్ డిసైడ్ చేస్తుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ తో ఏం ప్లాన్ చేశాడు అనే క్యూరియాసిటీ చాలామందికి మొదలైంది. అయితే ఈ సినిమాకి సంబంధించి భారీ హైప్ ఉంది. సినిమా విడుదలకు సరిగ్గా ఆరు రోజులు ముందు ట్రైలర్ విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 19న ఓ జి సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుంది. దీనిపై ఫ్యాన్స్ మరోరకంగా కొద్దిపాటి నిరాశన వ్యక్తం చేస్తున్నారు. మరి అంత లేటుగా రిలీజ్ చేస్తే ఏం బాగుంటుంది అనేది కొంతమంది అభిప్రాయం. ట్రైలర్ రిలీజ్ గురించి అధికారిక అప్డేట్ రానుంది.