BigTV English

OTT Movie : చావడానికెళ్లి సైకో చేతిలో అడ్డంగా బుక్… అమ్మాయిని కదలకుండా చేసి ఆ పని… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : చావడానికెళ్లి సైకో చేతిలో అడ్డంగా బుక్… అమ్మాయిని కదలకుండా చేసి ఆ పని… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే థ్రిల్లర్ కంటెంట్ ఉన్న సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ప్రేక్షకులు. ఇలాంటి సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువే. అయితే కొన్ని థ్రిల్లర్ సినిమాలు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది. సస్పెన్స్ తో మైండ్ ని బెండ్ చేసే సీన్స్ టెన్షన్ పెట్టిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో సూసైడ్ నుంచి కాపాడిన వ్యక్తే మళ్ళీ ప్రాణాలు తీయాలనుకుంటాడు. ఈ విచిత్రమైన సినిమాని మీరు కూడా చూడాలనుకుంటే, ఓటీటీలో అందుబాటులో ఉంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


స్టోరీలోకి వెళ్తే ..

ఐరిస్ తన కుమారుడు మాటియో ఒక హైకింగ్ ప్రమాదంలో మరణించిన గాయం నుండి బయట పడలేకపోతుంది. ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కాలిఫోర్నియాలోని ఒక అడవి పార్కుకు వెళ్తుంది. ఆమె క్లిఫ్ అంచున ఉండగా, రిచర్డ్ అనే ఒక అపరిచితుడు ఆమెను ఆపి, తన సొంత బాధాకరమైన గతం గురించి (తన భార్య క్లోయీ కారు ప్రమాదంలో మరణించిన కథ) చెప్పి ఆమెను ఓదార్చినట్లు కనిపిస్తాడు. అప్పుడు ఆమె ఆత్మహత్య ఆలోచనను విరమించుకుంటుంది. వీళ్ళు పార్కింగ్ లాట్‌కు తిరిగి వచ్చినప్పుడు, రిచర్డ్ ఆమెపై హఠాత్తుగా దాడి చేసి, ఆమె శరీరాన్ని క్రమంగా పక్షవాతానికి గురిచేసే ఒక ఔషధాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. ఐరిస్ తన శరీరం పూర్తిగా కదలలేని స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితిలో కూడా పారిపోవడానికి, పోరాడటానికి ప్రయత్నిస్తుంది.


ఈ సమయంలో ఆమె జీవన పోరాటం మొదలవుతుంది. ఐరిస్ అడవిలో పారిపోతూ ఒక చోట పూర్తిగా కదలలేని స్థితిలో పడిపోతుంది. చివరికి బిల్ అనే ఒక స్థానిక రైతు ఆమెను చూసి తన క్యాబిన్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆమె కేవలం కనురెప్పలతో మాత్రమే సమాచారం అందించగలదు. రిచర్డ్, ఐరిస్‌ను వెతుకుతూ క్యాబిన్‌కు చేరుకుని, ఆమె మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చినట్లు చెప్పి, తనని ఆమె భర్తగా పరిచయం చేసుకుంటాడు. కానీ బిల్ కి అతని మీద అనుమానం వస్తుంది. రిచర్డ్ బిల్‌ను చంపి, ఐరిస్‌ను ఒక సరస్సులో ముంచి చంపాలని ప్లాన్ చేస్తాడు. ఐరిస్ తన కదలికలను కొంతవరకు తిరిగి పొంది, రిచర్డ్‌ను కత్తితో పొడిచి, అతని దగ్గర ఉన్న తుపాకీని చాకచక్యంగా తీసుకుని కాలుస్తుంది. చివరికి రిచర్డ్ చనిపోతాడా ? మళ్ళీ బతికి వస్తాడా ? రిచర్డ్ ఎందుకు ఐరిస్ చంపాలనుకుంటాడు ? ఐరిస్ ప్రాణాలతో బయట పడుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘డోంట్ మూవ్’ (Don’t Move) 2024లో విడుదలైన అమెరికన్ హారర్ థ్రిల్లర్ చిత్రం. ఆడమ్ షిండ్లర్, బ్రియాన్ నెట్టో దర్శకత్వంలో రూపొందింది. ఇందులో కెల్సీ అస్బిల్ (ఐరిస్), ఫిన్ విట్‌రాక్ (రిచర్డ్), మోరే ట్రెడ్‌వెల్ (బిల్), డేనియల్ ఫ్రాన్సిస్ (డాంట్రెల్) నటించారు. ఈ సినిమా 2024 అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, 92 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.8/10 రేటింగ్ ను పొందింది. ఇది 2024 సాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ టెలివిజన్ ప్రెజెంటేషన్‌కు నామినేట్ అయింది.

Read Also : ఈమె అమ్మాయా ఆడ పిశాచా? ఇంత కరువులో ఉందేంటి భయ్యా… సింగిల్స్ కు ఎంజాయ్ పండగో

Related News

OTT Movie : లవర్స్ మధ్యలో మరో అమ్మాయి… మెంటలెక్కించే తుంటరి పనులు…. ఇయర్ ఫోన్స్ మర్చిపోవద్దు మావా

OTT Movie : అద్దాల ఇంట్లో అనాథ పిల్లలు… అడుగడుగునా ఆరాచకమే… అబ్బాయిని కట్టేసి అలాంటి పనులా భయ్యా

Thriller Movie in OTT : ఇదేం సినిమా రా అయ్యా.. బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తుంది… ఒంటరిగా చూడకండి..

OTT Movie : రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌తో 4.5 గ్యాంగ్ ఫైట్… రెస్పెక్ట్ కోసం పాలు, పూల మాఫియాలోకి… కితకితలు పెట్టే మలయాళ కామెడీ సిరీస్

OTT Movie : సమ్మర్ క్యాంపుకు వెళ్లి కిల్లర్ చేతికి చిక్కే అమ్మాయిలు… వణుకు పుట్టించే సీన్స్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : ఇండియా చరిత్రలోనే అతిపెద్ద కాల్ సెంటర్ స్కామ్‌… రియల్ స్టోరీ మాత్రమే కాదు, ఇది కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×