BigTV English

Mirai Film: మిరాయ్ సినిమాలో రాముడిగా  స్టార్ హీరో… థియేటర్లు తగలబడి పోవాల్సిందే?

Mirai Film: మిరాయ్ సినిమాలో రాముడిగా  స్టార్ హీరో… థియేటర్లు తగలబడి పోవాల్సిందే?

Mirai Film: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja)ప్రధాన పాత్రలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మిరాయ్ (Mirai). ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే హీరో తేజ సజ్జ ఇతర చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం చెన్నైలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు.


అంచనాలు పెంచిన ట్రైలర్..

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ చివరిలో రాముడి పాత్ర(Lord Rama Role)ను చూపించారు అయితే ఆ పాత్రలో ఏ హీరో నటించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలోనే రాముడి పాత్రలో నటించిన హీరో ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇక చెన్నై ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ నుంచి తేజ సజ్జకు ఇదే ప్రశ్న ఎదురయింది. మిరాయ్ సినిమాలో రాముడి పాత్రలో మహేష్ బాబు(Mahesh Babu) నటించబోతున్నారా అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు తేజ సమాధానం చెబుతూ రాముడి పాత్రలో మహేష్ బాబు గారు నటించాలని నేను కూడా కోరుకుంటాను కానీ ఆయన నటించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.


రాముడిగా మహేష్ బాబు?

ఒకవేళ ఈ సినిమాలో మహేష్ బాబు కనుక నటించి ఉంటే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని అభిమానులు భావిస్తున్నారు. ఇక రాముడు పాత్రలో మహేష్ బాబు అద్భుతంగా సెట్ అవుతారంటూ మరికొందరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ సినిమాలో నటించే అవకాశం కూడా లేదనే చెప్పాలి. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. రాజమౌళితో సినిమాకు కమిట్ అయితే ఇతర సినిమాలు చేసే అవకాశం మాత్రం ఇవ్వరు. మరి ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించిన ఆ హీరో ఎవరనే విషయం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు మనం ఎదురు చూడాల్సిందే.

విలన్ పాత్రలో మంచు మనోజ్..

ఈ సినిమాలో తేజ ధర్మాన్ని కాపాడే యోధుడిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా తేజ నటించగా, విలన్ పాత్రలో మంచు మనోజ్ (Manchu Manoj)నటించడం విశేషం. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, శ్రేయ వంటి తదితరులు నటిస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన తేజ తన తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. మరి మిరాయ్ సినిమా ద్వారా తేజ సజ్జ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మనోజ్ వెల్లడించారు.

Also Read: Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

 

Related News

Teja Sajja: అన్నీ నేనే చేశాను. నాకు బాడీ డబుల్ ఎవరూ లేరు

OG Trailer Update: ఓజీ ట్రైలర్ ఎప్పుడంటే? మరీ అంత లేటా?

NTRNeel : ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు అన్ని లీకులే, ఈ కష్టం శత్రువుకి కూడా రాకూడదు

Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్

Nag Ashwin: కల్కి లో ఆ స్టార్లు కలెక్షన్స్ కోసం కాదు… అయ్యో డైరెక్టర్ నాగ్ అశ్విన్ పరువు తీశాడే!

Big Stories

×