BigTV English

Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్

Coolie : నేనేమీ చెప్పలేదు అన్నీ మీరే అనుకున్నారు, కూలీ సినిమా రిజల్ట్ పై లోకి రియాక్షన్
Advertisement

Coolie : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న గ్రేట్ డైరెక్టర్స్ లో లోకేష్ కనగరాజ్ ఒకరు. నగరం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ మొదటి సినిమాతోనే మంచి పేరును సాధించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా సంచలనం. మాస్టర్ అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత వచ్చిన విక్రమ్ సినిమాతో లోకేష్ రేంజ్ అమాంతం మారిపోయింది.


దీనికి కారణం లోకేష్ సినీమాటిక్ యూనివర్స్. విక్రమ్ సినిమా విడుదలకు ఒక రోజు ముందు, విక్రమ్ సినిమా చూడడానికి వచ్చేవాళ్లంతా ఒకసారి ఖైదీ సినిమా చూసి రండి అని ట్విట్ చేశాడు. ఆ ట్వీట్ పెద్దగా అప్పుడు ఎవరికీ అర్థం కాకపోయినా నెక్స్ట్ రోజు సినిమా చూసినప్పుడు మాత్రం లోకేష్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది.

కూలీ సినిమాపై లోకేష్ రియాక్షన్ 


సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కు విక్రమ్ సినిమాతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు కాబట్టి, రజినీకాంత్ కి కూడా అదే స్థాయి హిట్ ఇస్తాడు అని అందరు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమాలో సత్యరాజ్ సైంటిస్ట్ గా కనిపించడం, అలానే వాచెస్ ని ఎక్కువ హైలెట్ చేయడం. ఇవన్నీ చూసి ఇది ఒక టైం ట్రావెల్ సినిమా అని ప్రేక్షకులు అనుకున్నారు. అలానే లోకేష్ సినీమాటిక్ యూనివర్స్ లో భాగం అని కూడా అనుకున్నారు. కానీ సినిమాలు ఇవేవీ కనిపించలేదు.

దీని గురించి లోకేష్ మాట్లాడుతూ నేను ఏ రోజు ఇది టైం ట్రావెల్స్ సినిమా అని చెప్పలేదు. అలానే ఇది ఎల్సీయూ లో భాగం అని కూడా చెప్పలేదు. అన్ని ప్రేక్షకులు మాత్రమే ఊహించుకున్నారు. నేను కూడా ఏ రోజు ప్రేక్షకుల అంచనాలను అందుకోవాలని సినిమాను రాయును. నాకు అనిపించింది చెప్పడానికి రాస్తాను అది ఒకవేళ ప్రేక్షకుడి అంచనాలను అందుకుంటే నేను హ్యాపీ. ఒకవేళ అందుకో లేకపోతే నేను ట్రై చేస్తాను అంటూ చెప్పాడు లోకేష్.

అంచనాలే దెబ్బకొట్టాయి 

మామూలుగా దర్శకుడు ముందు సినిమాలు చూసి నెక్స్ట్ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెట్టుకోవడం అనేది చాలా మామూలు విషయం. లోకేష్ విషయంలో కూడా ప్రేక్షకులు అందరూ అదే చేశారు. అందుకే సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అలా అని లోకేష్ కూలీ సినిమాతో డిసప్పాయింట్ అయితే చేయలేదు. కానీ ఊహించిన స్థాయిలో లేదు అనేది అందరి కంప్లైంట్. మొత్తానికి ఆ కంప్లైంట్ కి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ తో సరైన సమాధానం చెప్పేసాడు లోకేష్ కనగరాజ్.

Also Read: Peddi: పెద్ది ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన రామ్ చరణ్

Related News

Bandla Ganesh: నా జీవితాన్ని మలుపు తిప్పిన డైరెక్టర్, హరీష్ శంకర్ రియాక్షన్ గమనించారా?

Spirit : ప్రభాస్ స్పెషల్ వీడియో రెడీ చేసిన సందీప్ రెడ్డి వంగ, మరో యానిమల్?

Hungry cheetah Song: ఓజి సినిమా నుంచి హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ రిలీజ్!

K- RAMP: నా సినిమాకు మైనస్ రేటింగ్ ఇచ్చినా పర్లేదు, బాహుబలి K-Ramp ఒకేలా చూడాలి

Rashmika Mandanna: మొదటిసారి నిశ్చితార్థం పై స్పందించిన రష్మిక.. భలే సమాధానం ఇచ్చిందిగా!

Baahubali Re Release: 8 ఏళ్ల క్రితమే బాహుబలి రీ రిలీజ్‌ ప్లాన్.. జక్కన్నకు ఐడియా ఇచ్చింది ఇతనే

Ustad Bhagat Singh : 12 సంవత్సరాల నుంచి ఉన్న కసి బయటపడుతుంది, నిర్మాత ఉస్తాద్ అప్డేట్స్

Bandla Ganesh: బండ్లన్న ఇంట్లో నైట్ పార్టీ… మెగాస్టార్‌తో సహా ఇండస్ట్రీ అంతా అక్కడే

Big Stories

×