BigTV English

KTR: హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: హరీష్ రావుపై కవిత ఆరోపణలు.. కేటీఆర్ సంచలన ట్వీట్

KTR: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కౌంటర్ గా బీఆర్ఎస్ పోస్ట్ చేసిన హరీష్ రావు వీడియోను కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఇది మా డైనమిక్ లీడర్ హరీశ్ రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని కేటీఆర్ క్యాప్షన్ తో రీట్వీట్ చేశారు. అలాగు కేసీఆర్ ప్రియ శిష్యుడి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇరిగేషన్ గురించి ఎంతో నేర్చుకుని ఉంటారని ఆశిస్తున్నానని హరీష్ రావును ఉద్దేశిస్తూ కొనియాడారు. అసెంబ్లీలో హరీష్‌ రావు ప్రసంగాన్ని ప్రశంసిస్తూ మాస్టర్ క్లాస్ అని ట్వీట్ చేసుకొచ్చారు. ‘ ప్రస్తుతం హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాల్లో సంచలన మారింది.


కవిత ఏమన్నారంటే..?

అంతకుముందు ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి అనకొండ హరీష్ రావే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు దుర్మార్గుల వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. హరీష్ రావు, సంతోష్ రావు లాంటి అవినీతిపరులు వల్లే కేసీఆర్ ఈరోజు బద్నాం అవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే.. కవిత ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే బీఆర్ఎస్ పరోక్షంగా గట్టి కౌంటర్ కూడా ఇచ్చింది.


బీఆర్ఎస్ కౌంటర్..

ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యింది. చెప్పకనే చెప్పకుండా.. కవిత గట్టి కౌంటరే వేసింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. హరీష్ రావు ఓ ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు పొలిటికల్ గా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ: MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

కవిత సస్పెండ్ దిశగా…

కవిత సంచలన వ్యాఖ్యలు చేసి దృష్ట్యా ఆమె వెంటనే చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కవిత పీఆర్‌వో ను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అన్ ఫాల్లో చేస్తున్నారు. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆమెను పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. మరీ కవితను సస్పెండ్ చేస్తారా లేదా అనేది చూడాలి..

ALSO READ: Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

Related News

Bathukamma Festival: గిన్నిస్ బుక్ లోకి బతుకమ్మ..! ఆ ఆలోచన తనకు రాలేదని కవితమ్మ బాధ

Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

Big Stories

×