BigTV English

OTT Movie : వశపరుచుకొని కోరిక తీర్చుకునే ఆటగాడు… ఈ సైకో టార్గెట్ ఆడవాళ్లే… మైండ్ బెండయ్యే ట్విస్టులు

OTT Movie : వశపరుచుకొని కోరిక తీర్చుకునే ఆటగాడు… ఈ సైకో టార్గెట్ ఆడవాళ్లే… మైండ్ బెండయ్యే ట్విస్టులు
Advertisement

OTT Movie : సైకలాజికల్ థీమ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ను ఇస్తుంటాయి. ఇలాంటి సినిమాలనుచూడటానికి కూడా మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక డాక్టర్ హిప్నటైజ్ చేసి హత్యలు చేపిస్తుంటాడు. ఈ సినిమా చూస్తున్నంతసేపు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో టెన్షన్ పడుతుంటారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

జెన్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తుంటుంది. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలతో సతమతమవుతూ, తన స్నేహితురాలి పార్టీలో డాక్టర్ కొలిన్ మీడ్ అనే ప్రఖ్యాత హిప్నోథెరపిస్ట్‌ను కలుస్తుంది. ఆమె మాజీ ప్రియుడు బ్రియాన్‌తో ఉన్న సమస్యలు, గతంలో జరిగిన గర్భస్రావం వల్ల కలిగిన బాధను అధిగమించడానికి మీడ్ హిప్నోథెరపీని సూచిస్తాడు. జెన్ హిప్నోసిస్ సెషన్‌లకు హాజరవుతుంది. కానీ ఆమె జీవితం గణనీయంగా మెరుగుపడినప్పటికీ, ఆమెకు సెషన్‌ల సమయంలో జరిగిన విషయాలు ఏమీ గుర్తుకు రావు. ఈ సమయంలో ఆమె బ్రియాన్‌ను చంపేస్తుంది. దీంతో ఆమెకు మీడ్ చర్యలపై అనుమానం మొదలవుతుంది.


మీడ్ గతంలో అనేక మంది అమ్మాయిలను హిప్నోసిస్ చేసి, కోరికలు తీర్చుకుని, నేరాలు చేయించినట్లు, జెన్ ఆమె స్నేహితురాలు గినా తెలుసుకుంటారు. మీడ్ తన రోగులలో “ఫెయిల్-సేఫ్” ట్రిగ్గర్స్‌ను పెట్టినట్లు తెలుస్తుంది. ఇది వాళ్ళని నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. జెన్, మీడ్ మాజీ గురువైన డాక్టర్ జేవియర్ సుల్లివన్ గురించి తెలుసుకుని అతని ఇంటికి వెళ్తుంది. అక్కడ మీడ్ వాస్తవానికి సుల్లివన్ కొడుకు అని తెలుస్తుంది. చివరికి మీడ్‌ను జెన్ ని ఎదుర్కొంటుంది. కానీ అతని హిప్నోటిక్ శక్తులు ఆమెను మరింత ప్రమాదంలో పడేస్తాయి. ఈ కథ ఒక ఉత్కంఠభరితమైన ముగింపుని ఇస్తుంది. మీడ్‌ను జెన్ ఎలా ఎదుర్కొంటుంది ? మీడ్‌ ఎందుకు హిప్నోథెరపీతో మనుషుల్ని చంపేలా చేస్తున్నాడు ? ఈ క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను మాత్రం, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

నెట్‌ఫ్లిక్స్‌లో

‘హిప్నోటిక్’ (Hypnotic) 2021లో విడుదలైన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. మాట్ ఏంజెల్, సుజానే కూట్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో కేట్ సీగల్ (జెన్), జాసన్ ఓ’మారా (డాక్టర్ కొలిన్ మీడ్), డూలే హిల్ (డిటెక్టివ్ వేడ్ రోలిన్స్), లూసీ గెస్ట్ (జీనా), జైమీ ఎం. కాలికా (బ్రియాన్) నటించారు. ఈ సినిమా 2021 అక్టోబర్ 27, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై, 88 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 5.3/10 రేటింగ్ ను పొందింది.

Read Also : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Related News

OG OTT: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ఓజీ… ఎప్పుడంటే!

K-Ramp: ఓటీటీ హక్కులు వారికే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT Movie : సీరియల్ కిల్లర్ ను పరుగులు పెట్టించే క్రైమ్ నావలిస్ట్ కొడుకు… శాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఉన్న క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : టీనేజ్ వయసులో ఇదేం పని? అన్నాచెల్లెళ్ల మధ్య అలాంటి బంధం… పెద్దలకు మాత్రమే

OTT Movie : ఏం సినిమా గురూ… ఆ సీన్లే హైలెట్… సింగిల్స్ కు పండగే

OTT Movie : భార్యను లేపేసి మరో అమ్మాయితో గుట్టుగా… ఆటకట్టించే ఆడపులి… చివరి వరకూ ట్విస్టులే

OTT Movie : పోలీసులే ఈ కిల్లర్ టార్గెట్… ఒక్కొక్కరిని వెంటాడి వేటాడి చంపే సైకో… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : శవాలుగా తేలే అమ్మాయిలు… కార్టూనిస్ట్ కన్నింగ్ భర్తపైనే అనుమానం… నరాలు కట్టయ్యే సస్పెన్స్

Big Stories

×