Teja Sajja: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో తేజ సజ్జ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో కనిపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. ఆ తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ (oh baby) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ మామ దర్శకత్వంలో వచ్చిన జాంబిరెడ్డి (zombi Reddy), హనుమాన్ సినిమాలు తేజకు మంచి పేరు తీసుకొచ్చాయి.
హనుమాన్ (Hanuman) సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నప్పుడు విడుదలైంది హనుమాన్. థియేటర్స్ కూడా ఆశించిన స్థాయిలో దొరకలేదు. ఆ తరుణంలో కేవలం మౌత్ టాక్ వలన ఈ సినిమా వేరే రేంజ్ కి వెళ్ళిపోయింది. ఒక్కసారిగా తేజాకి కూడా విపరీతమైన గుర్తింపు వచ్చింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది ఆ సినిమా.
మిరాయ్ కోసం తేజ కష్టం
మిరాయ్ సినిమాకు సంబంధించిన టీజర్ విపరీతమైన అంచనాలను పెంచింది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ట్రైలర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో విడుదలవుతుంది. తమిళ్లో ఈ సినిమాను ఏజీఎస్ సినిమాస్ విడుదల చేస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది.
ఈ సినిమా కోసం పర్సనల్ గా తేజ సజ్జ చాలా కష్టపడ్డాడు. ఒక 20 రోజులు పాటు బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్లి ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ సినిమాలో అన్ని స్టంట్స్ కూడా తేజ సొంతంగా చేశాడు. తనుకు ఎవరూ బాడీ డబుల్స్ లేరు అని తమిళ ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చాడు.
తమిళ్ లో అదరగొట్టాడు
మామూలుగా చాలామంది తమిళ్ హీరోలు తెలుగు ఫిలిం ఈవెంట్స్ కి వచ్చి తెలుగు మాట్లాడినప్పుడు మనకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. ఇప్పుడు తేజ కూడా తమిళ్ ప్రెస్ మీట్ లో తనను తాను తమిళ్ లోనే పరిచయం చేసుకున్నాడు. అలానే తమ సినిమాని ఆదరించమని తమిళ్ లో స్పీచ్ ఇచ్చాడు. ప్రెస్ మీట్ లో ఎదురైన ప్రతి ప్రశ్నకు తీరిగ్గా సమాధానం చెప్పాడు. అలానే సెప్టెంబర్ 12న సినిమా విడుదల అవుతుంది. ఇదివరకే మీరు సినిమాలను ఆదరించినట్లు ఈ సినిమాను కూడా ఆదరించండి అంటూ మాట్లాడాడు తేజ. ఈ సినిమాని తమిళ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు వేచి చూడాలి.
Also Read: OG Trailer Update: ఓజీ ట్రైలర్ ఎప్పుడంటే? మరీ అంత లేటా?