BigTV English

Pawan Kalyan: నువ్వెంత.. నీ బ్రతుకెంత అన్నారు.. ఇప్పుడు నోరు పెగలడం లేదే

Pawan Kalyan: నువ్వెంత.. నీ బ్రతుకెంత అన్నారు.. ఇప్పుడు నోరు పెగలడం లేదే

Pawan Kalyan: కర్మ ఎవరిని వదలదు. సమయం వచ్చినప్పుడు అందరి దూల తీర్చేస్తుంది. ఇది సినిమా డైలాగ్ కాదు. వాస్తవంగా జరుగుతుంది. అధికార మదంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడిన రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకునే రోజు వచ్చింది. ఎన్ని విమర్శలు ఎదురైనా.. ఎన్ని అవమానాలను భరించినా.. కష్టపడి పనిచేస్తే.. తమ సమయం కోసం ఎదురుచూస్తే.. ఏదో ఒకరోజు విజయం నీ కాళ్ళ వద్దకు వచ్చి చేరుతుంది అన్న మాటను పవన్ కళ్యాణ్ నిరూపించారు.


పదేళ్ల క్రితం జనసేన అనే పార్టీని స్థాపించి.. ప్రజల కోసం సేవ చేయాలనీ కంకణం కట్టుకున్న పవన్.. అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలు అంటే సినిమాలు చేసినంత ఈజీ కాదని, చెయ్యి ఊపగానే ఎగిరే ఫ్యాన్స్ లా ప్రజలు ఉండరని విమర్శించారు. అయన కుటుంబాన్ని నడిరోడ్డుమీదకు లాగారు. తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు అని తేడా లేకుండా అందరి ముందు విమర్శించారు.

అయినా వాటన్నింటిని తట్టుకొని ప్రజలకు ఏదో చేయాలనీ దృఢ నిశ్చయంతో పవన్ పదేళ్లు ఎంతో కష్టపడ్డారు. అలా ఏపీ ఎలక్షన్స్ 2024 లో రికార్డు సృష్టించారు. అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వం అన్నవారి చెంప చెల్లుమనేలా నేడు అసెంబీలో డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక దీంతో వైసీపీ నాయకులు అప్పుడు అన్న మాటలను అభిమానులు మరోసారి గుర్తిచేసుకుంటున్నారు.


ముఖ్యంగా నగరి మంత్రిగా రోజా ఉన్నప్పుడు పవన్ ను ఎలాంటి మాటలు అన్నదో చెప్పుకొస్తూ పవన్ అసెంబ్లీ వీడియోను కౌంటర్ గా షేర్ చేస్తున్నారు. “ఎమ్మెల్యే కాదు కదా.. కనీసం వార్డ్ మెంబెర్ కూడా కాలేదు. అసలు నువ్వెంత.. నీ బ్రతుకెంత .. నీ స్థాయి ఎంత.. నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాకలేవు.. జగన్ అన్న వెంట్రుక కూడా పీకలేవు” అంటూ చెప్పుకొచ్చింది.

కట్ చేస్తే.. అదే అసెంబ్లీలో ఆమె చెప్పిన ఎమ్మెల్యేగా కాకుండా సీఎం తరువాత సీఎం.. డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసి తన సత్తాను నిరూపించారు. ఇక ఈ రెండు వీడియోలను షేర్ చేస్తూ అభిమానులు.. నువ్వెంత.. నీ బ్రతుకెంత అన్నారు.. ఇప్పుడు నోరు కూడా లేవడం లేదుగా అని కొందరు.. ఆయన స్థాయి.. ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యేంత.. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి అందుకోనేంత.. ఏది ఇప్పుడు మాట్లాడండి ఆయన స్థాయి గురించి అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×