Venu Swamy: వేణు స్వామి(Venu Swamy) పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతోమంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలను చెప్పుతూ వారి కోసం ప్రత్యేక పూజలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఒకానొక సమయంలో నిత్యం సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుతూ వివాదాలలో నిలిచారు.. ఇలా ప్రభాస్ రష్మిక విజయ్ దేవరకొండ, రకుల్, నయనతార, నాగచైతన్య, సమంత, శోభిత వంటి సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలను చెప్పడమే కాకుండా వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని విడాకులు తీసుకొని విడిపోతారంటూ ఈయన చెప్పిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
ఇక నాగచైతన్య శోభిత విషయంలో ఈయన చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా ఈయన చర్యలను తప్పుపడుతూ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వేణు స్వామి కాస్త సినిమా సెలబ్రిటీల గురించి మాట్లాడటం తగ్గించారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈయన తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఒక పూజకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈయన వటుక భైరవ (Vatuka Bhairava)అనే పూకార్యక్రమాన్ని నిర్వహించారని తెలుస్తోంది. పూజా కార్యక్రమంలో భాగంగా ఈయన స్వామి వారికి మద్యం, మాంసం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించి పూజ చేశారు. అదేవిధంగా వీటన్నింటినీ హోమంలో వేసి ఆహుతి ఇచ్చారు.
ఈ వటుక భైరవ పూజ ఎవరి పేరు మీద అయితే చేస్తామో వారికి కోర్టు వ్యవహారాలను, రాజకీయ వ్యవహారాలలో, డబ్బు పరంగా కూడా విజయాలు లభిస్తాయని అలాగే సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుందని ముఖ్యంగా శత్రువుల నాశనం జరుగుతుందని తెలిపారు. ఇలా ఈ పూజ చేయించుకోవడం వల్ల ఎనిమిది సత్ఫలితాలు కలుగుతాయని వేణు స్వామి వెల్లడించారు. ఇక ఈ వటుక భైరవ పూజా కార్యక్రమంలో తప్పకుండా మద్యం మాంసం నైవేద్యంగా సమర్పించాలని తెలిపారు.
?igsh=MWV1eTlkeXdyb21xdA%3D%3D
ఈ పూజా కార్యక్రమం అనంతరం పూజ చేయించిన యజమానికి పూజా ఫలితం దక్కాలి అంటే చివరిలో నీటి మీద తేలియాడుతూ వటుక భైరవ పూజకు సంబంధించిన మంత్రాలను జపించాలని తెలిపారు. ఇక వేణు స్వామి కూడా పూజ అనంతరం ఫామ్ హౌస్ లోనే ఉన్న స్విమ్మింగ్ పూల్ నీటిపై తేలియాడుతూ వటుక భైరవ మంత్రాలను జపిస్తూ ఈ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోని ఈయన తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో పై సోషల్ మీడియా వేదికగా విభిన్న రీతిలో కామెంట్ లు వ్యక్తమవుతున్నాయి. అయితే వేణు స్వామి చేసే పూజలలో తప్పకుండా మాంసం మద్యం దేవుడికి నైవేద్యంగా పెట్టడంతో తరచూ ఈ విషయంపై చర్చలు జరుగుతూ ఉంటాయి. ఈయన చేసిన వటుక భైరవ పూజలో మాంసం మద్యం లేకపోతే పూజ ఫలితం తగ్గదని తెలిపారు.
Also Read: Nagarjuna 100: నాగార్జున లాటరీ కింగ్ నుంచి టబు ఔట్.. రేస్ లోకి మరో స్టార్?