Sree Leela:ఏంటీ యాడ్ కోసం రూ.150 కోట్లు కేటాయించారా? వినడానికే ఆశ్చర్యంగా ఉంటే.. ఇక ఆ యాడ్ చూస్తే ఇంకెలా ఉంటుందో అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఎట్టకేలకు శ్రీ లీల (SreeLeela) నటించిన ఈ రూ.150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఆ యాడ్ ఎలా ఉంది? అది దేనికి సంబంధించింది? అందులో ఎవరెవరు నటించారు? ఇంత బడ్జెట్ పెట్టడం వెనక అసలు కారణం ఏంటి ? ఇలా పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
శ్రీ లీల 150 కోట్ల ట్రైలర్ రిలీజ్..
విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh), టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీ లీలా (Sree Leela) కలిసి నటించిన యాడ్ “ఏజెంట్ చింగ్ అటాక్”. చింగ్స్ దేశీ చైనీస్ అనే బ్రాండ్ ఈ యాడ్ ను నిర్మించింది. ఇందులో రణవీర్ సింగ్ ఏజెంట్ సింగ్ గా కనిపించగా.. శ్రీ లీల ఏజెంట్ మిర్చిగా.. ప్రముఖ నటుడు బాబి డియోల్(Bobby Deol) ప్రొఫెసర్ వైట్ నాయిస్ పాత్రలో నటించారు. ఈ యాడ్ కి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee )దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదల చేసిన ఈ యాడ్ ఫిలిం అఫీషియల్ ట్రైలర్ అంటూ విడుదల చేసిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను అబ్బురపరచడమే కాకుండా అయినా ఈ యాడ్ కి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడంలో తప్పులేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Rashmika Mandanna: జోరు పెంచిన రష్మిక.. 2 వారాల్లోనే 2 సినిమాలు..