BigTV English

Mustache: ఇలా చేస్తే గడ్డం.. మీసాలు పెరుగుతాయి

Mustache: ఇలా చేస్తే గడ్డం.. మీసాలు పెరుగుతాయి

Mustache: మగవారిలో ఒక వయసు వచ్చేసరికి మీసాలు, గడ్డాలు పెరుగుతాయి. యుక్త వయసులో గడ్డం, మీసాల పెరుగుదల ప్రారంభమవుతుంది. 20 ఏళ్ళు వయసు దాటాక అవి బాగా పెరగడం మొదలవుతాయి. 30 ఏళ్లు వచ్చేసరికి గడ్డాలు, మీసాలు బాగా దట్టంగా పెరుగుతాయి.


కొందరికి ఏళ్లు గడుస్తున్నా మీసాలు మాత్రం పెరగవు. దీంతో గడ్డాలు, మీసాలు పెరగలేదని బాధపడుతుంటారు. గడ్డం పెరగకపోవడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. అయితే గడ్డాలు, మీసాలు పెరిగని వారు చింతించాల్సిన అవసరం లేదు. కొన్ని చిట్కాలను పాటిస్తే వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయి. దీంతో మంచి ఆకృతిలో మీ ముఖం కనిపిస్తుంది. ఒక టమాటా తీసుకొని తొక్క తీసి దాన్ని జ్యూస్‌లా చేసుకోవాలి. అందులో ఒక అర టీస్పూన్ కలబంద గుజ్జు, టీ స్పూన్ ఆముదం, అర టీ స్పూన్ నల్ల జీలకర్ర పొడిని కలపాలి. అన్నింటిని బాగా మిశ్రమంగా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని రాత్రిపూట గడ్డాలు, మీసాల భాగంలో బాగా మర్దన చేయాలి. ఒక ఐదు నిమిషాల పాటు ఇలా చేసిన తర్వాత అలాగే వదిలేయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే తప్పక వెంట్రుకలు పెరుగుతాయి. కొందరికి కొన్ని రోజులు సమయం పట్టవచ్చు. అయినా ఫలితం వచ్చేవరకు దీన్ని ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల గడ్డాలు, మీసాలు గుబురుగా పెరుగుతాయి. టమోటాల్లో ఉండే విటమిన్ సి, కలబంద గుజ్జు, ఆముదం నల్ల జీలకర్రలో ఉండే విటమిన్ ఈలు మీ శిరోజాలను బాగా పెరిగేందుకు దోహదపడతాయి. ఈ ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యనిపుణులు అంటున్నారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×