E-Paper
Advertisement

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ ఇల్లు రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే.. ?

Pawan Kalyan: పిఠాపురంలో పవన్ ఇల్లు రెడీ.. గృహ ప్రవేశం ఎప్పుడంటే.. ?
Advertisement

Pawan kalyan house in pithapuram

Pawan kalyan house in pithapuram(Political news in AP): జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారారు. ప్రస్తుతం ఆయన ఫోకస్ అంత రాజకీయాలపైనే ఉంది. ఏపీలో ఎలక్షన్స్ హీట్ ఏరేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. మొదటి నుంచి కూడా పవన్.. విజయం కోసం కష్టపడుతూనే ఉన్నాడు. కానీ, విజయాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. అయితే ఈసారి టీడీపీ పొత్తుతో జనసేన బరిలోకి దిగుతుంది. ఇప్పటికే వరుస ప్రచారాలు చేస్తూ బిజీగా మారిన పవన్.. ఈమధ్యనే అస్వస్థతకు గురై రెస్ట్ తీసుకుంటున్న విషయం తెల్సిందే.

Advertisement

ఇక ఈ మధ్యనే పవన్ పిఠాపురాన్ని తన స్వస్థలం గా మార్చుకుంటాను అని సభాముఖంగా చెప్పుకొచ్చారు. ఇక చెప్పిందే తడువుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు రెడీ అవుతుంది. ఆయన ఆఫీస్ కు, ఇంటికి అనువుగా ఉండేలా ఆ ఇంటిని డిజైన్ చేయిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. పవన్ కార్యాలయం, వసతికి అనువుగా చేబ్రోలులో ఒక భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఉగాదికి పవన్ గృహప్రవేశం చేయనునున్నట్లు తెలుస్తోంది. ఇల్లు కూడా చాలా రిచ్ లుక్ లో అద్భుతంగా ఉంది.

ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రచారంలో బిజీగా ఉండడంతో అన్ని సినిమాలు హోల్డ్ లో ఉన్నాయి. పవన్ చేతిలో హరిహర వీరుమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. ఓజి ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఉస్తాద్ ఎలక్షన్స్ తరువాత మొదలుకానుంది. హరిహర వీరమల్లు సైతం ఎలక్షన్స్ తరువాతనే ముగించే ప్లాన్ లో ఉన్నాడు పవన్. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×