BigTV English

Congress Ministers: తెలంగాణలో సంక్షోభానికి కారణం బీఆర్ఎస్సే.. కేసీఆర్‌పై మంత్రులు ఫైర్..

Congress Ministers: తెలంగాణలో సంక్షోభానికి కారణం బీఆర్ఎస్సే.. కేసీఆర్‌పై మంత్రులు ఫైర్..
Congress Ministers On KCR & BRS
Congress Ministers On KCR & BRS

Congress Ministers On KCR & BRS: తెలంగాణలో సంక్షోభానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని.. వెయ్యి గజాల లోతున పాతి పెట్టినా తప్పులేదని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు మండిపడ్డారు.


బీఆర్ఎస్ పాలన వల్లే తెలంగాణలో కరువు వచ్చిందని అన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కమీషన్ భగీరథ అని.. వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసిన ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టును కమీషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం రీడిజైన్ చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో వరద కాల్వలు ఎండిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. నిపుణుల సలహా తీసుకుని.. వారి అభిప్రాయాల మేరకే ప్రాజెక్టులపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఏపీ సీఎం కృష్ణా జలాలు తరలించుకుపోతే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.


Also Read: Congress Party: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్‌ జనజాతర బహిరంగ సభ..

కేసీఆర్ పొగరు అహంకార వల్లే బీఆర్ఎస్‌కు తక్కువ సీట్లు వచ్చాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.

ఇక చేనేత కార్మికులను ఏనాడు పట్టించుకోలేదని.. వారికి తీవ్ర ద్రోహం చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణలో సంక్షోభానికి కారణం బీఆర్ఎస్సేనని మండిపడ్డారు.

Related News

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Big Stories

×