Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (Mark Shankar Pawanovich) అగ్నిప్రమాదంలో ఇరుక్కున్నారు. సింగపూర్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ పవనోవిచ్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మార్కు శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డ చిన్నారిని హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది హాస్పిటల్ కి తరలించారు.ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మన్యంలో పర్యటన పూర్తయిన తర్వాత సింగపూర్ కి బయలుదేరనున్నట్లు వార్తలు రాగా.. అసలు సింగపూర్లో ఆ అగ్నిప్రమాదం ఎలా చోటు చేసుకుంది? ఆ అగ్ని ప్రమాదంలో పవన్ కొడుకు ఎలా చిక్కుకున్నాడు? అసలు ఈ ప్రమాదం నుండి మార్క్ శంకర్ ను అగ్నిమాపక సిబ్బంది ఎలా కాపాడారు ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
HBD Akhil: ‘సిసింద్రీ’ మొదలు ‘ఏజెంట్’ వరకూ.. ఇప్పటికైనా ఆ తప్పు తెలుసుకుంటారా..?
అగ్నిప్రమాదం ఎలా జరిగిందంటే..?
పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ప్రస్తుతం సింగపూర్లో పిల్లలతో కలిసి జీవిస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఆమె ఇండియాకి వస్తూ తన భర్తను కలుస్తూ ఉంటారు. అయితే ఎప్పటిలాగే మార్కు శంకర్ రివర్ వ్యాలీ లో ఉన్న రోడ్ నెంబర్ 278 లో స్కూల్ కి చేరుకున్నారు. అయితే ఉదయం 9:45 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో వెంటనే అక్కడి యాజమాన్యం సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ కి సమాచారం అందించారు. ఇకపోతే ఇది టొమాటో కుకింగ్ స్కూల్.. ఇది వంట పాఠశాలను నిర్వహిస్తోంది. న్యూటన్ షో బ్యానర్ కింద విద్యా శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తూ వుంటుంది. ఇక ఇక్కడే మార్క్ శంకర్ విద్యను అభ్యసిస్తూ ఉండగా.. అది కుకింగ్ పాఠశాల కాబట్టి ఏదైనా తప్పిదం వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడంతస్తుల భవనంలోని 2,3వ అంతస్తులలో మంటలు చెలరేగాయి. ఇక వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని.. పెద్దపెద్ద నిచ్చెనలు, కంబైన్డ్ ప్లాట్ఫామ్ నిచ్చెనలను వేసి మరి 15 మంది పిల్లలతో పాటు నలుగురు పెద్దలను రక్షించారు. ఇకపోతే పెద్ద ఎత్తున పొగ వెలువడడంతో పిల్లల ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిందని ,దీంతో పిల్లలను హుటాహుటిన హాస్పిటల్ కి కూడా చేర్చినట్లు సమాచారం.
అగ్ని ప్రమాదం పై స్పందించిన చిరంజీవి , మాజీ సీఎం జగన్
అంతేకాదు ఇక్కడ సమీప ప్రాంతంలో ఉన్న దాదాపు 80 మందిని పోలీసులు అలాగే ఎస్సిడిఎఫ్ సిబ్బంది కాళీ చేయించారు. మొత్తం 19 మందిని హాస్పిటల్ కు తరలించినట్లు ఎస్సిడిఎఫ్ స్పష్టం చేసింది. ఇకపోతే మార్క్ శంకర్ కి ప్రమాదం జరిగిందని తెలియడంతో ఇక్కడ మెగా ఫ్యామిలీ, అభిమానులు, జనసేన నాయకులు అందరూ కలవర పాటుకు గురవుతున్నారు. దీంతో వెంటనే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించి మార్క్ శంకర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు అని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు మార్క్ శంకర్ కి జరిగిన అగ్నిప్రమాదం పై ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టారు. “అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు అగ్ని ప్రమాదానికి గురయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాము. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ కోరారు.