HBD Akhil..అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మరో హీరో అఖిల్ (Akhil)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao)మనవడిగా , కింగ్ నాగార్జున (Nagarjuna) కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ వారి స్టార్ స్టేటస్ ఈయనకు ఏమాత్రం ఉపయోగపడడం లేదనే వార్తలు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం. వాస్తవానికి ఎలాంటి స్టార్ కిడ్ కైనా సరే ఇండస్ట్రీలోకి రావడానికి మాత్రమే తల్లిదండ్రుల క్రేజ్ వర్తిస్తుంది. ఒకసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టామంటే.. సొంత టాలెంట్ తోనే ఎదగాల్సి ఉంటుంది. అలా ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎంతోమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత తమ టాలెంట్ ను ఉపయోగించుకొని నేడు గ్లోబల్ స్టార్స్ గా పేరు సొంతం చేసుకున్నారు.
సక్సెస్ కోసం ఆరాటపడుతున్న అఖిల్..
అయితే సినీ బ్యాక్ గ్రౌండ్ వుండి, ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అక్కినేని అఖిల్ కి మాత్రం కలిసి రావడంలేదని చెప్పవచ్చు. అక్కినేని నాగార్జున – అక్కినేని అమల దంపతులకు కుమారుడిగా జన్మించిన ఈయన.. తన బాల్యంలోనే ‘సిసింద్రీ’ సినిమాతో తన కెరియర్ ను ప్రారంభించారు. అప్పటికి ఆయన వయసు కేవలం ఒక సంవత్సరం మాత్రమే. 1994 ఏప్రిల్ 8న కాలిఫోర్నియాలోని సాన్ జోస్ లో జన్మించారు అఖిల్. చైతన్య విద్యాలయంలో స్కూలు విద్యను ప్రారంభించిన అఖిల్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో చదువును రెండేళ్ల పాటు కొనసాగించి, ఆ తర్వాత హైదరాబాదులోని ఓయాక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో పూర్తి చేశారు. ఇక 16వ ఏట నుండి సినీ ప్రస్థానంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. కానీ నాగార్జున కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో చేరడానికి బదులు న్యూయార్క్ లోని లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో నటన కోర్సులో చేరాడు.
ఇకనైనా జాగ్రత్త పడతారా..?
ఇక 2014లో ‘మనం’ సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈయన ‘అఖిల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆటాడుకుందాం రా, హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ , ఏజెంట్ వంటి భిన్న విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ ఏ సినిమా కూడా అఖిల్ కి మంచి విజయాన్ని అందించలేకపోయింది. అఖిల్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రియాల్టీ లోకి రావాలి అని .. ముఖ్యంగా యంగ్ హీరోలు సైతం స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటుంటే.. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ కావడంలో వెనుకడుగు వేస్తున్నారు. అసలు కథలు డిజాస్టర్ అవ్వడానికి గల కారణం ఏమిటి ? ఎక్కడ లోపం ఉంది? అనే విషయాలను తెలుసుకొని మరి సినిమా నిర్మిస్తే బాగుంటుందని, అప్పుడైనా సినిమాతో సక్సెస్ అందుకోవచ్చని చెబుతున్నారు. మరి అఖిల్ ఇకనైనా సినిమా విషయంలో జాగ్రత్తలు పడి సక్సెస్ అవుతారేమో చూడాలి.