Pawan On Volunteers: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు గడిచిపోయింది. అయినా వాలంటీర్ల వ్యవస్థపై చీటికి మాటికీ చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల మొదలు ప్రభుత్వ పెద్దలు ఎక్కడకు వెళ్లినా దీనిపై చాలామంది ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు వాలంటీర్ల వ్యవస్థ గురించి డీటేల్స్ మొత్తం బయటపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం డుంబ్రిగుడ మండలం కురిది గ్రామంలో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అక్కడ పలు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజనులతో ఆయన ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం.
వాలంటీర్లను కొనసాగిస్తామని ఎన్నికల ముందు చెప్పామని గుర్తు చేశారు ఆయన. వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి పేపర్ లేదన్నారు. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా ఏమీ లేదన్నారు. దీనికి సంబంధించి ఎలాంటి జీవో ఇవ్వలేదన్నారు. వాలంటీర్లు-ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారని తెలిపారు. వాలంటీర్లను అప్పటి వైసీపీ ప్రభుత్వం వంచించిందన్నారు.
ఈ విషయమై కేబినెట్ సమావేశంలో మంత్రి నారా లోకేష్‌తో కలిసి రెండు మూడుసార్లు ప్రస్తావించామని వివరించారు. వాలంటీర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి జీతాలు రాలేదన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంఖు చక్రంలో పడేసిందన్నారు.
ALSO READ: ఇవే తగ్గించుకుంటే మంచిది.. వైసీపీ లీడర్లకు క్లాస్
వాలంటీర్లను తీసుకున్నప్పుడు సేవ చేయడానికి అని చెప్పారని, వాళ్లు ప్రభుత్వంలో ఉన్నట్లు ఆర్థిక శాఖ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. మద్యం వ్యవహారంలో 25 వేల కోట్లు ఎలా దోచుకున్నారో, వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు చెప్పి మాయ చేశారన్నారు.
ఏజెన్సీల్లో తరచూ అక్కడివారిని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యపై నోరు విప్పారు. సికిల్ సెల్ అనీమియా వ్యాధి డ్రైవ్ చేసి గుర్తించాలని, ఈ విషయాన్ని కేబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చించి అంగన్వాడీలతో పోషక పదార్దాలు అందించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
2018లో వచ్చినప్పుడు అన్ని సమస్యలు తనకు గుర్తు ఉన్నాయి కాబట్టే మళ్ళీ వచ్చానని చెప్పారు పవన్. సికిల్ సెల్ అనీమియా వ్యాధిపై ముఖ్యమంత్రికి అవగాహన ఉందన్నారు. నారా భువనేశ్వరి ట్రస్ట్ ద్వారా పని చేస్తున్నామని, ఈ మధ్య 50 లక్షలు డొనేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక్కడ వేల ఎకరాల్లో కాఫీ పంట వేస్తున్నారని, ఇక్కడి భూములు అందరికి అందుబాటులోకి వచ్చేలా చేస్తానన్నారు. థింసా డాన్స్ చేసే వాళ్లు ఉసిరి, స్టాబేర్రి వంటి పంటలు సాగు చేస్తే జాతీయ ఉపాధి హామీ పధకం నుండి నిధులు తీసుకువచ్చి డెవలప్ చేస్తానని తెలిపారు. పండించిన పంటలను మార్కెటింగ్ శాఖ ద్వారా విశాఖలో మార్కెటింగ్ చేస్తామన్నారు.
కురిడి గ్రామాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకుని వాణిజ్య పంటలు పండించడానికి మార్గాలు వెతుకుతామన్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు కోసం చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గంజాయి వద్దని, దానికంటే తులసి మొక్క నాటడం మంచిదన్నారు.
టూరిజం మాదిరిగా గ్రామ దేవతల ఆలయాలను సాంస్కృతిక శాఖతో కలిపి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఏజెన్సీ ప్రాంతం అందాలు పెరిగేలా చూడాలి తప్పా, అందం పోయేలా ఉండకూడదన్నారు. తాను గిరిజనుడిగా పుట్టలేదు కానీ, ఆలోచన ఉందన్నారు. కేరళ టూరిజం మోడల్‌ను దృష్టిలో పెట్టుకుని అరకు టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కురిడి గ్రామానికి నా తరపున 5 లక్షలు ఇస్తానని చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పాం
కానీ వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారు
వాలంటీర్లకు సంబంధించి ఏ పేపర్ వర్క్ ప్రభుత్వం దగ్గర లేదు
అసలు వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవు
ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి వాలంటీర్లను మభ్యపెట్టారు
– డిప్యూటీ సీఎం… pic.twitter.com/woH6rPM0Lw
— BIG TV Breaking News (@bigtvtelugu) April 8, 2025