BigTV English

Shreyas Iyer: పంజాబ్ దారుణ ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్ లో దారుణంగా ఏడ్చిన కెప్టెన్

Shreyas Iyer: పంజాబ్ దారుణ ఓటమి.. డ్రెస్సింగ్ రూమ్ లో దారుణంగా ఏడ్చిన కెప్టెన్

Shreyas Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025లో భాగంగా 18వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ – పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. రాజస్థాన్ జట్టు పంజాబ్ కింగ్స్ ని 50 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో పంజాబ్ ఈ సీజన్ లో తొలిసారి ఓడిపోయింది. శనివారం ముల్లన్ పూర్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో 206 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో బరిలోకి దిగిన పంజాబ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది.


 

దీంతో 50 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ క్రమంలో నేడు చండీఘడ్ లో చెన్నై సూపర్ కింగ్స్ – పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. పంజాబ్ జట్టు తన సొంత మైదానంలో వరుసగా రెండవ మ్యాచ్ ఆడబోతోంది. చివరి మ్యాచ్ లో ఇక్కడ ఓటమిని ఎదుర్కొన్న పంజాబ్.. ఈసారి కచ్చితంగా గెలుపొందాలని వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయిన నేపథ్యంలో.. ఈ మ్యాచ్ లో గెలిచి గెలుపు బాట పట్టాలని కోరుకుంటుంది.


ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ – చెన్నై జట్ల మధ్య జరిగిన 30 మ్యాచ్లలో.. చెన్నై 16 మ్యాచ్లలో గెలుపొందగా.. పంజాబ్ 14 మ్యాచ్లలో గెలుపొందింది. అయితే ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్ లో సొంత మైదానంలో కలకత్తా జట్టుకి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈరోజు చెన్నైతో మ్యాచ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పంజాబ్ కెప్టెన్ శ్రేయష్ అయ్యర్.. తాను చివరిసారిగా ఏడ్చిన సంఘటనను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యాడు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత విక్టరీలో కీలకపాత్ర పోషించిన అయ్యర్.. ఈ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దుబాయిలో నెట్స్ లో ఏడ్చినట్టు వెల్లడించాడు. దుబాయ్ లోని కండిషన్లు అలవాటు పడడంలో ఇబ్బందులు ఎదురవడంతో.. తాను ఏడుపు ఆపుకోలేకపోయానని “క్యాండిట్ విత్ కింగ్స్” ఎపిసోడ్ లో బయటపెట్టాడు. ” చివరిసారిగా నేను ఏడ్చింది చాంపియన్స్ ట్రోఫీలో. మొదటి ప్రాక్టీస్ సెషన్ లో నిజంగానే ఏడ్చాను.

ఆరోజు నేను నెక్స్ట్ లో బ్యాటింగ్ చేశాను. కానీ అది వర్కౌట్ కాలేదు. నెట్స్ లో బంతిని కనెక్ట్ చేయలేకపోయాను. దీంతో నా మీద నాకే చాలా కోపం వచ్చింది. ఇక ఏం చేయాలో తెలియక ఏడవడం మొదలుపెట్టాను. నేనెప్పుడూ అంత ఈజీగా కన్నీళ్లు పెట్టుకోను. కానీ ఆరోజు ఏడ్చేసరికి షాకింగ్ గా అనిపించింది. అంతకు ముందు ఇంగ్లాండ్ సిరీస్ లో నేను బాగానే ఆడాను. అదే జోరును ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలనుకున్నాను.

 

కానీ తొలి సెషన్ లోనే చేదు అనుభవం ఎదురు కావడం వల్ల నిరాశకు గురయ్యాను. ఆ తరువాత పిచ్ పరిస్థితులను అర్థం చేసుకొని నాదైన శైలిలో ఆడాను” అని చెప్పుకొచ్చాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా టైటిల్ సాధించడంలో శ్రేయస్ అయ్యర్ ది కీలక పాత్ర. అయ్యర్ 5 మ్యాచ్లలో అద్భుత ఆట తీరుతో రాణించి జట్టుకు వెన్నెముక గా నిలిచాడు. ఈ వన్డే టోర్నీలో మొత్తంగా 243 పరుగులు సాధించి.. భారత తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు.

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×