
Payal Rajput : తెలుగు సినీ ఇండస్ట్రీ లో కొందరు ఈజీగా స్టార్ట్ స్టేటస్ అని కొందరికి మాత్రం అది చాలా కష్టమనే చెప్పాలి. వరుసగా సినిమాలు తీసిన రాని గుర్తింపు కొన్ని సందర్భాలలో ఒక సినిమాతోనే వచ్చేస్తుంది. అయితే ఆ సినిమా ఆ యాక్టర్ కెరియర్ లో ఎప్పుడు వస్తుంది అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు.అజయ్ భూపతి డైరెక్షన్లో వచ్చిన ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పరిస్థితి కూడా అదే. మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ అంతగా అవకాశాలు అయితే రాలేదు. మరి ఇప్పుడు మంగళవారం అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమాలోని బోల్డ్ గా నటించి ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఇండస్ట్రీలో హీరోయిన్ గా పర్వాలేదు అన్న టాక్ తెచ్చుకుంది. ఆర్ఎక్స్ 100 తర్వాత నటించిన కొద్దిపాటి చిత్రాలలో చాలావరకు బోల్డ్ క్యారెక్టర్స్ లోనే నటించింది పాయల్. తిరిగి తన లక్కీ డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్లో మంగళవారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అజయ్ భూపతి హ్యాండ్ మహిమ పాయల్ కి సూపర్ గా కలిసి వచ్చింది అంటున్నారు నెటిజన్స్.
ఇంతకీ ఆ ఛాన్స్ ఏమిటంటే పాయల్ ఏకంగా పుష్ప స్టార్ తో జతకట్టనుంది. మంగళవారం మూవీ మంచి టాక్ తెచ్చుకోవడంతో పాయల్ కి వరుసగా ఆఫర్లు క్యూ కట్టినట్టు తెలుస్తుంది. ఏకంగా ఐకాన్ స్టార్ తోటి మూవీ అంటే మాటలు కాదు కదా.. ఒకవేళ బన్నీ కాంబినేషన్లో పాయల్ బాగా క్లిక్ అయితే ఇక స్టార్ హీరోల ఆఫర్స్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. రీసెంట్ గా మంగళవారం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అల్లు అర్జున్ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ ..త్రివిక్రమ్ తో తన తదుపరి ఫ్యాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ కి అవకాశం వచ్చింది . అటు హీరో చూస్తే ఐకానిక్ స్టార్.. ఇటు డైరెక్టర్ చూస్తే మాటల మాంత్రికుడు.. హీరోయిన్ ఏమో బోల్డ్ క్యారెక్టర్.. మరి ఈ క్రేజీ కాంబోలో రాబోయే మూవీ ఏ రకంగా ఉంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఆ విషయం పక్కన పెడితే మొత్తానికి మంగళవారం హీరోయిన్ మంగళకరమైన ఆఫర్స్ తన ఖాతాలో వేసుకుని అని నెటిజన్స్ ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Payal Rajput, Pushpa,Iconic star, Allu Arjun, Trivikram Srinivas, Ajay Bhoopathi