
Shami Wife : భారతదేశమంతా ఒక పేరు మార్మోగిపోతోంది.. అతనే మహ్మద్ షమీ. వన్డే వరల్డ్ కప్ 2023లో అతని విధ్వంసం మామూలుగా లేదు. క్రికెట్ ప్రపంచంలో తనిప్పుడు ఎవరెస్ట్ అంత ఎత్తున ఉన్నాడు.
కానీ వ్యక్తిగత జీవితంలో చూస్తే అధ:పాతాళంలో ఉన్నాడు. భార్య హసీన్ జహాన్ తో వచ్చిన మనస్పర్థలు కోర్టు వరకు వెళ్లాయి. భరణం ఇచ్చేవరకు వెళ్లింది.
ఇప్పుడు షమీ కి వస్తున్న పేరు చూసి.. అతని భార్య హసీన్ జహాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తను అద్భుతమైన బౌలర్. అందులో తిరుగు లేదు. అలాగే మంచి భర్తగా ఉండి ఉంటే, ఈ రోజున మా పాప భవిష్యత్తు ఎంతో బాగుండేది. మా ఇద్దరి జీవితం ఎంతో హ్యాపీగా ఉండేదని పేర్కొంది. ఇప్పటికి ఒకవైపు నుంచి బాధపడుతూనే మరోవైపున షమీని తిట్టిపోస్తోంది.
షమీ ప్రపంచకప్ లో అద్భుత ప్రదర్శన చేస్తుంటే, ఈవిడ ఆరిపోయిన గాయాన్ని మళ్లీ తట్టి లేపడం సరికాదని అందరూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడెంతో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ కి అడుగుదూరంలో టీమ్ ఇండియా ఉంది. షమీది చాలా కీలకమైన పాత్రగా మారింది. ఇది గెలిస్తే క్రికెట్ కి కాదు ఇండియా పేరు ప్రపంచమంతటా మార్మోగుతుంది. అది కదా అందరికీ కావల్సిందని అంటున్నారు.
ఈ టైమ్ లో ఈ మహా తల్లి మళ్లీ టీవీల ముందుకొచ్చి ఇలా మాట్లాడటం సరికాదని, అది షమీ మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందని అంటున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టి షమీ అద్భుతాలు చేస్తుంటే.. ఈవిడ గారు మళ్లీ పాత పంచాయతీలు బయటకు తీయడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.‘‘మహాతల్లీ నీకో నమస్కారం.. ఇవన్నీ ఇప్పుడు పెట్టకు’’ అని నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
షమీని పెళ్లి చేసుకునేందుకు రెడీ అంటూ బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. సెలెబ్రిటీలకు ఇవన్నీ సహజమని తెలిపింది. పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలపై తాను మాట్లాడలేనని చెప్పింది. 2014, జూన్ 6న ఛీర్ గర్ల్ అయిన హసీన్ జహాన్‌ను మహమ్మద్ షమీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2015లో వీరికి ఓ పాప జన్మించింది. 2018, మార్చి 8న మహమ్మద్ షమీపై హసీన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసి గృహ హింస కేసు పెట్టింది. 2023 ప్రారంభంలో హసీన్ జహాన్‌కు నెలకు రూ. 1.30 లక్షలు భరణం కింద చెల్లించాలని షమీకి కోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.