E-Paper
Advertisement

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 
Advertisement

Manchu Manoj: నటుడుగా, విలన్ గా , హీరోగా ఎన్నో సంచలనాత్మకమైన సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ బయట కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఆయనకు కూడా వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు, నెగిటివ్ గా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు అనేది కూడా వాస్తవం.

ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో చాలా మంది పెద్ద వ్యక్తుల్ని గౌరవం లేకుండా మాట్లాడటం అనేది నొప్పించే విషయం. సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగేశ్వరరావు వంటి పెద్ద వ్యక్తుల గురించి కూడా కొంచెం తక్కువగా చేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి పరిశ్రమలో వారసత్వం అనేది కామన్ గా ఎలా వస్తుందో, సినీ పరిశ్రమలో కూడా వారసత్వం అలానే వచ్చింది. మోహన్ బాబు కుమారులైన మంచు విష్ణు, మంచు మనోజ్, మంచు లక్ష్మి వీళ్ళు కూడా సినిమాల్లో రాణిస్తున్నారు. మీరందరిలో కంటే మనోజ్ కి కొద్దిపాటి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పాలి. ఎందుకంటే మిగతా నటులతో మనోజ్ వ్యవహరించిన తీరు మాట్లాడే విధానం కొంతమేరకు అభిమానుల్ని ఆయనకు తీసుకొచ్చి పెట్టింది.

మనోజ్ వ్యక్తిగత జీవితం 

Advertisement

వ్యక్తిగతంగా కూడా మనోజ్ చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. మనోజ్ పొలిటిషన్ అయినా భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. నేడు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగపూరితమైన ఒక పోస్టును పెట్టాడు మనోజ్.

?igsh=MWY3b21wbncyMDYyMQ==

ఎమోషనల్ పోస్ట్ 

Advertisement

మనోజ్ instagram వేదికగా… ఆది పరాశక్తి అంటే నువ్వే. నువ్వు నా జీవితంలోకి అడుగుపెట్టిన రోజు నుండి, గందరగోళంలో నీ మౌనం, కష్టాల్లో కూడా నీ దయ, నిన్ను బాధపెట్టిన వారి పట్ల, ప్రజల పట్ల నీ అచంచల కరుణ యొక్క మాయాజాలాన్ని నేను చూశాను. ఆ బలం మరియు స్వచ్ఛత నన్ను విస్మయంతో తల వంచేలా చేస్తాయి.

నా భార్యగా, నువ్వు సమతుల్యతను మరియు ప్రేమను తెచ్చావు. ధైరవుడు, దేవసేన మరియు చిన్న జోయా తల్లిగా, నువ్వు వారి ప్రతి అడుగును నడిపించే వెలుగుగా మారావు, మా ఇంటిని వెచ్చదనం, నవ్వు మరియు ఆశతో నింపావు. నమస్తే వరల్డ్ యొక్క CEO మరియు వ్యవస్థాపకురాలిగా, సంస్కృతిలో పాతుకుపోయిన, ప్రకాశంతో అమలు చేయబడిన మరియు వినయంతో తీసుకువెళ్ళబడిన దార్శనికత ఏమి సాధించగలదో నువ్వు చూపించావు. మరియు రాయలసీమ కుమార్తెగా, ప్రజలకు నీ నిరంతర సేవ నిన్ను నాయకురాలిగా మాత్రమే కాకుండా లెక్కలేనన్ని జీవితాలకు ప్రేరణగా చేస్తుంది.

జీవితంలో నువ్వు ఎప్పుడూ దురాశ పడలేదు, నువ్వు ఎప్పుడూ నీ కష్టాన్ని నమ్ముకున్నావు, నీ ఆత్మగౌరవం నన్ను నన్ను నేను మరింత గౌరవించుకునేలా చేసింది.

నీ వల్లే నేను ఈ రోజు మంచి మరియు ప్రశాంతమైన వ్యక్తిని. నాపై, మాపై, మరియు రాబోయే అందమైన ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ సరళత నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంది, మీ ధైర్యం నాకు స్ఫూర్తినిస్తూనే ఉంది మరియు మీ ప్రేమ నన్ను స్వస్థపరుస్తూనే ఉంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు నా ప్రేమ, నా భాగస్వామి, నా బలం, నా శక్తి. ప్రపంచం, మన పిల్లలు మరియు నేను మీ వల్ల ధన్యులమయ్యాము. అంటూ కంప్లీట్ ఎమోషనల్ పోస్ట్ పెడుతూ ఫొటోస్ కూడా షేర్ చేశాడు.

Also Read: Sandhya Shantaram: ప్రముఖ నటి కన్నుమూత, బాలీవుడ్ లో అలుముకున్న విషాదఛాయలు

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×