BigTV English

Sam Altman : శామ్‌కే తిరిగి ఓపెన్ ఏఐ పగ్గాలు?

Sam Altman : శామ్‌కే తిరిగి ఓపెన్ ఏఐ పగ్గాలు?
Sam Altman

Sam Altman : ఎలాంటి నోటీసు లేకుండా ఏఐ సూపర్‌స్టార్ శామ్ ఆల్ట్‌మన్‌ను ఆకస్మికంగా ఫైర్ చేసినందుకు ఓపెన్ ఏఐ బోర్డు పశ్చాత్తాపపడుతోందా? ఆయనను సీఈవోగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి టెక్ పరిశ్రమ వర్గాలు. ఇప్పటికే ఈ దిశగా శామ్ ఆల్ట్‌మన్‌‌తో సంప్రదింపులు జరుగుతున్నట్టు.. ఓపెన్ ఏఐలో పరిణామాలను అత్యంత దగ్గర నుంచి పరిశీలిస్తున్న పలువురు స్పష్టం చేశారు.


మరోవైపు ఆయనకు తిరిగి సీఈవో బాధ్యతలు అప్పగించాలంటూ ఇన్వెస్టర్ల నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. బోర్డు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొనేలా చూడాలంటూ ఓపెన్ ఏఐ‌లో మెజారిటీ వాటా కలిగిన మైక్రోసాఫ్ట్‌తో త్రైవ్ కేపిటల్ సహా ఇన్వెస్టర్లలో కొందరు చర్చలు జరుపుతున్నారు. ఆల్ట్‌మన్‌తో పాటు మాజీ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రక్‌మన్ తిరిగి వెనక్కి వచ్చేందుకు వీలుగా బోర్డు రాజీనామా చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది.

ఆల్ట్‌మన్‌కు ఉద్వాసన జరిగిన వెంటనే బ్రక్‌మాన్ తప్పుకోవడంతో పాటు.. ఆ బాటలోనే మరో ముగ్గురు సీనియర్ రిసెర్చర్లు నడిచేందుకు ఉద్యుక్తులయ్యారు. కొత్త ఏఐ కంపెనీని ఆరంభించే దిశగా అడుగులు పడుతున్నట్టు ఆల్ట్‌మన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


కొత్త ఏఐ హార్డ్‌వేర్ డివైస్‌ను రూపొందించేందుకు ఆల్ట్‌మన్, యాపిల్ మాజీ డిజైన్ చీఫ్ జానీ ఈవ్ చర్చలు జరిపినట్టు రెండు నెలల క్రితమే వార్తలొచ్చాయి. సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో మసయోషి సన్ కూడా ఆ చర్చల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ ఆల్ట్‌మన్ కొత్త కంపెనీ ఆరంభించే యోచన ఏదైనా ఉంటే ఓపెన్ ఏఐలో కీలకస్థానాల్లో ఉన్నవారు ఆ సంస్థకు గుడ్‌బై చెప్పడం ఖాయం. ఓపెన్ ఏఐ సంస్థ విలువను 29 బిలియన్ డాలర్ల నుంచి 80 బిలియన్ డాలర్లకు చేర్చడంలో శామ్ అత్యంత కీలకంగా వ్యవహరించారు.
ఏ సంస్థలో ఉన్నా.. నిధుల సమీకరణ విషయంలో ఆయనకు ఎవరూ సాటి రారు.

ఓపెన్ ఏఐలో మైక్రో‌సాఫ్ట్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టిందంటే కారణం ఆల్ట్‌మన్ అనే చెప్పుకోవాలి. ఈ విషయమై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను ఒప్పించడంలో ఆల్ట్‌మన్ ఎంతో ఓర్పు, నేర్పు చూపించారు. నిధులు సమీకరించగల సత్తాతో పాటు ఏఐ టెక్నాలజీపై ఎంతో పట్టున్న శామ్ లాంటి వ్యక్తికి ఉద్వాసన పలకడం ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేసింది. బోర్డు నిర్ణయం సంస్థంకు ఎంత మాత్రం క్షేమకరం కాదని వారు బలంగా విశ్వసిస్తున్నారు.

Related News

Infinix Hot 60i vs Tecno Spark Go: ₹10,000 లోపు ధరలో కొత్త 5G ఫోన్లు.. ఏది బెటర్?

Galaxy S24 Ultra Alternatives: గెలాక్సీ S24 అల్ట్రాకు పోటీనిచ్చే ప్రీమియం ఫోన్లు.. తక్కువ ధర, అద్భుత ఫీచర్లతో శాంసంగ్‌కు చెక్

Vivo G3 5G Launch: వివో G3 5G విడుదల.. ₹20,000 లోపు ధరలో 6000mAh బ్యాటరీ, HD+ డిస్‌ప్లే

WhatsApp Scam: వాట్సాప్ నయా స్కామ్, షేర్ చేశారో అకౌంట్ ఖాళీ అవ్వడం పక్కా!

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Big Stories

×