BigTV English

Pooja Hegde Updates : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పూజా హెగ్డే బ్యాటిల్ స్కార్స్…

Pooja Hegde Updates : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న పూజా హెగ్డే బ్యాటిల్ స్కార్స్…
Pooja Hegde


Pooja Hegde Updates( Latest Entertainment updates ) : టాలీవుడ్ బుట్ట బొమ్మ.. పూజా హెగ్డే…పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. మొదట ఐరన్ లెగ్ అని అనిపించుకున్న క్రమంగా సక్సెస్ లతో సినిమాలను క్యూ కట్టించింది. పూజా అందానికి.. ఓ నవ్వు నవ్వవే జిగేలు రాణి…అంటూ కుర్ర కారు ఫిదా అయిపోయారు. అలా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న పూజా హెగ్డే.. మరొకసారి మహేష్ తో గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్ గా నటించడానికి ఓకే చెప్పండి. మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాల దగ్గర నుంచి షూటింగ్ స్టార్టింగ్ వరకు యాక్టివ్ గా ఉన్న పూజా సడన్ గా మూవీ నుంచి తప్పుకుంది.

ఒక గుంటూరు కారం చిత్రమే కాదు…హరీష్ శంకర్ ,పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి కూడా పూజా తప్పుకుంది. ఓ పక్క ఈ మూవీస్ అన్నిటిలో పూజా ప్లేస్ లో శ్రీ లీల ను తీసుకున్నారు. మరోపక్క ఇక పూజ కెరియర్ ముగిసిందని.. ఇక ఆమె ఇంటికే పరిమితం అంటూ తెగ కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ వార్తలపై పూజా హెగ్డే అసలు స్పందించలేదు.


ఈ గాసిప్స్ పక్కన పెట్టి…చక్కగా తన ఫిట్నెస్ పై పూర్తి ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ.పూజా మొదటినుంచి మంచి ఫిట్నెస్ ఫ్రీక్ కాబట్టే….ఆ రేంజ్ లో బాడీ మెయింటైన్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఆమె ఎక్కువ సమయాన్ని జిమ్ లోనే గడుపుతోందట. జిమ్ అంటే ఏదో తేలికపాటి వెయిట్ లిఫ్టింగ్ అనుకున్నారు…కాదండోయ్ కసరత్తులతో పాటు బాక్సింగ్ లో కూడా దిగిందట పూజా. అయితే ఆమె కసరత్తుల వెనక ఏదన్నా పెద్ద మూవీకి సర్ప్రైజ్ ప్లానింగ్ ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా తన ట్రైనర్ తో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పూజా కు బాగానే గాయాలయ్యాయి. అయితే తనకు తగిలిన గాయాలను నిరభ్యంతరంగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టి మరి.. వీటిని నేను బాటిల్ స్కార్స్ అనుకుంటాను అంటూ క్యాప్షన్ పెట్టింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా ఫ్యాన్స్ దెబ్బలతో ఉన్న ఆమె లెగ్స్ చూసి తెగ ఫీల్ అయిపోతున్నారు. మరోపక్క కొంతమంది ఆమె పట్టుదలకు అభినందనలు తెలుపుతున్నారు. ఏదేమైనప్పటికీ త్వరలో పూజా తిరిగి మూవీస్ లో మునుపటిలా నటించాలి అని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×