
BJP Telangana Election Committee : కేంద్ర బీజేపీ తెలంగాణ ఎన్నికల బీజేపీ కమిటీలను ప్రకటించింది. మొత్తం 14 కమిటీలు, వాటికి చైర్మన్లుగా రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న నేతలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ పబ్లిక్ మీటింగ్స్ కమిటీ ఛైర్మన్‌గా బండి సంజయ్, ఆందోళనల కమిటీ ఛైర్ పర్సన్‌గా విజయశాంతి, ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్‌గా మురళీధర్‌రావు, సోషల్‌మీడియా కమిటీ ఛైర్మన్‌గా అర్వింద్, ఈసీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌గా మర్రి శశిధర్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామిలను నియమించింది.
అలాగే.. బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా మహేష్‌రెడ్డి, కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మీడియా కమిటీ ఛైర్మన్‌గా రఘునందన్‌రావు, SC సెగ్మెంట్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా జితేందర్‌రెడ్డి, ST సెగ్మెంట్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్‌రావులు నియమితులయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర పదాధికారులు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో సమావేశమైంది. కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. జిల్లా, ఎన్నికల నిర్వహణ కమిటీల ఏర్పాటుపై, శుక్రవారం జరిగే స్టేట్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
Revanth Reddy comments: వన్ నేషన్- వన్ ఎలక్షన్.. బీజేపీ కుట్ర ఇదే : రేవంత్ రెడ్డి