Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అతడు సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మరోపక్క ఖలేజా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం పై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
గుంటూరు కారం మూవీ ట్రెయిలర్ లో మహేష్ బాబు మరింత స్పైసీగా కనిపించడంతో ఈ మూవీ మంచి మాస్ ట్రీట్ గా ఉంటుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. మూవీ షూటింగ్ మొదలు పెడుతున్నారు అనుకున్నప్పటి నుంచి గుంటూరు కారం ఏదో ఒకరకంగా వివాదాల మధ్యలో చిక్కుకుంటుంది. ఫస్ట్ ఇందులో హీరోయిన్ గా అనుకున్న పూజా సడన్ గా మూవీ నుంచి తప్పుకోవడం జరిగింది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి చాలామంది మూవీ నుంచి వెళ్తున్నారు అన్న పుకార్లు సోషల్ మీడియాలో తెగ షికార్లు చేశాయి.
అంతేకాకుండా సినిమా సెట్స్ నుంచి లీకైన సీన్స్ వెంటనే వైరల్ అవుతున్నాయి.దీనికి సంబంధించి చిత్ర బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక రూపంలో ఈ చిత్రానికి సంబంధించిన వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన మరొక తాజా వార్త సరికొత్త సంచలనానికి నాంది పలుకుతోంది. ఇందులో మహేష్ బాబు మదర్ క్యారెక్టర్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. అయితే ఇందులో వైరల్ అవ్వాల్సినంత ఏముంది అని అనుకుంటున్నారా అయితే అసలు విషయం తెలుసుకుందాం పదండి.
రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినప్పటి నుంచి అటు అత్తగా ,ఇటు అమ్మగా ఎందరో స్టార్ హీరో, హీరోయిన్లతో నటించారు, ఇంకా నటిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా జైలర్ మూవీలో రజనీకాంత్ వైఫ్ గా రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు గుంటూరు కారంలో మొదటిసారి మహేష్ బాబుతో తల్లి పాత్రలో నటిస్తున్నారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే… రమ్యకృష్ణ ఇంతకుముందు మహేష్ బాబుతో ఆల్రెడీ నటించింది.
2004 లో వచ్చిన మహేష్.. నాని మూవీ గుర్తుందా.. ఇందులో ఒక హాట్ స్పైసీ సాంగ్ కి రమ్యకృష్ణ మహేష్ తో కలిసి స్టెప్పులు వేసింది. స్టెప్పులు అంటే మామూలువి కాదండోయ్… మాంచి మాస్ స్టెప్పులే. అయితే ఈ సాంగ్ షూటింగ్ జరిగిన తరువాత కొన్ని కారణాలవల్ల ఫైనల్ వర్షన్ లో దీన్ని చేర్చలేదు. మూవీ నుంచి కట్ చేశారు కాబట్టి అప్పట్లో ఆ సాంగ్ ఒకటి ఉంది అని ఎవరికి తెలియలేదు…కానీ కొద్దిరోజుల క్రితం యూట్యూబ్ లో ఈ సాంగ్ మంచి సంచలనాన్ని సృష్టించింది. ప్రస్తుతం రమ్యకృష్ణ మహేష్ తల్లిగా నటిస్తోంది అన్న వార్త వైరల్ అయిన తర్వాత నేటిజెన్లు ఆ పాటను లింక్ చేసి మీమ్స్ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.