Poonam Dhillon:ప్రముఖ నటి, రాజకీయవేత్త అయిన పూనమ్ ధిల్లాన్ (Poonam Dhillon) తెలుగులో 2001లో విడుదలైన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 2009లో బిగ్ బాస్ (Bigg Boss) లో కూడా పాల్గొన్న ఈమె.. 2013లో సోనీ టీవీ సీరియల్స్ ‘ఏక్ నయీ పెహచాన్ ‘ లో శారదహ మోదీగా ప్రధాన పాత్ర పోషించింది. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, దుబాయ్ వంటి దేశాలలో అనేక ప్రదర్శనలతో పాటు ‘ది పర్ఫెక్ట్ వైఫ్ ‘ లో కూడా నటించింది. నటిగానే కాకుండా సామాజిక కార్యకర్తగా, రాజకీయ వేత్తగా కూడా ఎదిగిన ఈమె మాదక ద్రవ్యాలు, ఎయిడ్స్, అవయవదానం, కుటుంబ నియంత్రణ వంటి సామాజిక అంశాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది.
Ashu Reddy: వర్మతో ఇంటర్వ్యూ తర్వాత చాలా ఇబ్బందిపడ్డా..!
కమల్ హాసన్ అందరి ముందు నన్ను తిట్టేశారు – పూనమ్ ధిల్లాన్..
ఇక ఇలా నిత్యం అందరినీ ఆకట్టుకునే ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కమలహాసన్ తనను అందరి ముందే తిట్టాడు అంటూ ఊహించని కామెంట్లు చేసింది. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద విశ్వనటుడిగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్.. తన సినిమాల పట్ల ఎంత పట్టుదలతో ఉంటారో అందరికీ తెలిసిందే. అలాంటి కమల్ హాసన్ ఇప్పటికీ కూడా సినిమాల కోసం ఎంతో కష్టపడతారు. ఉదాహరణకు గత ఏడాది వచ్చిన ‘కల్కి 2’ సినిమా ఆయన నటనకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ వయసులో కూడా అలాంటి పాత్రలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అందుకేనేమో ఆయనను విశ్వ నటుడు అని అంటారు. అయితే ఇలాంటి ఈయన.. స్టార్ హీరోయిన్ పూనమ్ ధిల్లాన్ ను అందరి ముందే తిట్టేసాడని ఆమె చెప్పుకొచ్చింది.
ఆయన వల్లే నాలో మార్పు వచ్చింది – పూనమ్ ధిల్లాన్..
పూనమ్ మాట్లాడుతూ.. “బాలీవుడ్లో గంట లేటుగా సినిమా షూటింగ్ కి వెళ్ళినా.. ఎవరు ఏమి అనేవారు కాదు.. దాంతో మాకు కూడా అదే అలవాటయింది. అందుకే కమల్ హాసన్ తో సినిమాకి కూడా ఒకరోజు నేను గంట లేటుగా వెళ్లాను. కానీ నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కామన్ గానే ఉన్నాను. కానీ అందరూ సెట్స్ లో నన్ను చాలా సీరియస్ గా చూస్తున్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ కమలహాసన్ వచ్చి ఎందుకు నువ్వు ఇంత లేటుగా వచ్చావు.. లైట్ బాయ్, కెమెరా మెన్ అందరూ కూడా ఉదయం 5 గంటలకే వచ్చారు. వారంతా నీకోసం గంట నుంచి ఎదురుచూస్తున్నారు. నువ్వు మాత్రం రాలేదు కానీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో ఆలోచించు అంటూ కాస్త స్వీట్ గా నాకు వార్నింగ్ ఇచ్చారు. అయితే అప్పుడే నాకు నేను చేసిన తప్పు తెలిసింది. దాంతో అందరికీ సారీ చెప్పాను. అప్పటినుంచి నేను ఏ రోజు కూడా ఎక్కడ పనిచేసిన సినిమా షూటింగ్ సెట్ కి ఆలస్యంగా వెళ్లలేదు” అంటూ పూనమ్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం పూనమ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.