BigTV English

Ashu Reddy: వర్మతో ఇంటర్వ్యూ తర్వాత.. ఇంట్లో అలాంటి పరిస్థితి, ‘కిస్సిక్ టాక్స్’లో అషూరెడ్డి ఎమోషనల్

Ashu Reddy: వర్మతో ఇంటర్వ్యూ తర్వాత.. ఇంట్లో అలాంటి పరిస్థితి, ‘కిస్సిక్ టాక్స్’లో అషూరెడ్డి ఎమోషనల్

Ashu Reddy:ఆషు రెడ్డి (Ashu Reddy).. జూనియర్ సమంతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు ఆల్బమ్ సాంగ్స్ చేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తో చేసిన ఇంటర్వ్యూతోనే లైమ్ లైట్ లోకి వచ్చిందని చెప్పడంలో సందేహం లేదు. అసలే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ వర్మ.. అలాంటి ఆయనతో అషు రెడ్డి చేసిన ఇంటర్వ్యూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ వల్ల ఆషురెడ్డితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఎదుర్కొన్న ఇబ్బందులు అంతా ఇంతా కాదని చెప్పాలి. ముఖ్యంగా అప్పట్లో ఆషురెడ్డి పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ విషయాలపై స్పందిస్తూ.. తాను చేసిన తప్పు అదే అంటూ చెప్పుకొచ్చింది అషు రెడ్డి.


జీవితంలో నేను చేసిన రెండు తప్పులు అవే – ఆషు రెడ్డి

తాజాగా జబర్దస్త్ వర్ష హోస్ట్గా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ షో కి గెస్ట్ గా వచ్చింది ఆషు రెడ్డి. ఇంటర్వ్యూలో భాగంగా వర్ష.. మీరు మీ జీవితంలో చేసిన తప్పేంటి?దానివల్ల ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? అని ప్రశ్నించగా.. ఆషు రెడ్డి మాట్లాడుతూ..” ఆ ఒక్కరోజు నేను నా బాయ్ ఫ్రెండ్ ని కలవక పోయి ఉండి ఉంటే బాగుండేది.ఆ తర్వాత మొత్తం నా లైఫ్ సంతోషం అయ్యేది. కానీ అతడిని కలవడమే నేను చేసిన అతిపెద్ద తప్పు అంటూ ఆషు రెడ్డి తెలిపింది. ఇక రెండవది వర్మతో ఇంటర్వ్యూ.. మొదటి ఇంటర్వ్యూ చేసినప్పుడు పెద్దగా ఏమనిపించలేదు. కానీ నేనే ఆయనతో రెండో ఇంటర్వ్యూ కూడా చేశాను. అప్పుడే అసలు ఇబ్బంది మొదలైంది. సమస్య ఏదైనా సరే నేను తప్పు చేస్తే ఆ తప్పును నేను సరిదిద్దుకుంటాను. ఆ ఇబ్బందులను ఫేస్ చేస్తాను.. కానీ ఆ సమయంలో మా పేరెంట్స్ గురించి నేను ఆలోచించలేదు. వారు ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. ఆ అపార్ట్మెంట్ వాళ్లతో వీళ్ళు కలిసి మాట్లాడాలి. మళ్లీ నేను నా పెట్ డాగ్ రాజుని తీసుకెళ్లి అదే అపార్ట్మెంట్లో వాకింగ్ చేయాలి.. ఆ చిన్నది ఏదైతే ఉందో అది నేను గమనించలేకపోయాను. ముఖ్యంగా అరె ఏంట్రా మీ అమ్మాయి చదువుకుంది.. ఇంత ఓపెన్ గా మాట్లాడుతోంది అంటూ చాలామంది కామెంట్లు చేశారు. దానివల్ల కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ముఖ్యంగా నా వల్ల నా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడ్డారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏమిటంటే మా తల్లిదండ్రులు బాధపడ్డారు అనే ఒక గిల్టీ ఫీలింగ్ మాత్రం నాలో ఎప్పటికీ పోదు” అంటూ ఆషు రెడ్డి చెప్పుకొచ్చింది.


వర్మతో ఇంటర్వ్యూ వల్లే ఆ సమస్య.. ఆషు రెడ్డి

ఇంక అంతే కాదు ఆమె మాట్లాడుతూ.. ఇలాంటి ఒక దాని కోసమా నేను అమెరికా నుండి తిరిగి వచ్చింది. నేను ఇది కాదు..ఇలాంటి పాపులారిటీ నాకు అవసరం లేదని, అప్పుడు రియలైజ్ అయ్యాను” అంటూ తెలిపింది. ఇకపోతే ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే అలా ఒక ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో వర్మ ఏకంగా ఆషు రెడ్డి కాలి పాదాల వేళ్లను నోట్లో పెట్టుకోవడం అప్పట్లో ఎంత సంచలనమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది ఆషు రెడ్డి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×