BigTV English

Poonam Kaur: వంచన చేస్తున్నాడు.. మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ పూనమ్..!

Poonam Kaur: వంచన చేస్తున్నాడు.. మరోసారి పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ పూనమ్..!

Poonam Kaur.. పూనమ్ కౌర్ (Poonam Kaur).. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. పంజాబీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ టాలీవుడ్ లో కొన్ని చిత్రాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. నిజానికి టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేయకపోయినా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై నిత్యం పోస్ట్లు పెడుతూ వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు రాజకీయ అంశాలపై కూడా స్పందిస్తూ.. తనదైన శైలిలో కామెంట్లు చేయడమే కాక, అప్పుడప్పుడు కాంట్రవర్సీల్లో కూడా ఇరుక్కుంటూ ఉంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో పాటు బడా హీరోలను కూడా ఈమె టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.


పవన్ కళ్యాణ్ పై పూనమ్ ఫైర్..

ఒకరకంగా చెప్పాలి అంటే, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అలాగే ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ లను పరోక్షంగా టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు పెడుతోంది. నిజానికి వీరి ముగ్గురు మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అవకాశం దొరికితే చాలు అటు పవన్ కళ్యాణ్ పై తన అక్కస్సు మొత్తాన్ని వెళ్ళగక్కుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి పవన్ కళ్యాణ్ పై మండిపడింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా సంచలనం సృష్టిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


మరో పోస్టుతో అక్కస్సు వెళ్లగక్కిన పూనమ్..

తాజాగా పూనమ్ కౌర్ తన పోస్టులో పవన్ కళ్యాణ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావించకుండా ఈ విధంగా పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగు సినీ నటుడైన పవన్ కళ్యాణ్ రాజకీయ లబ్ధి కోసమే హిందూ సెంటిమెంట్ ను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించింది. అందులో భాగంగానే ఆమె తన పోస్టులో.. ఎవరైనా సనాతన ధర్మ యోధుడిగా ఎలా తన వారసత్వాన్ని పూర్తిగా సనాతన క్రైస్తవంలోకి మార్చుకుంటారు..వారి కపటత్వం చూస్తే నాకు అసహ్యంగా ఉంది.. దేవుడు అన్నీ చూస్తున్నాడు అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది పూనమ్ కౌర్.

పూనమ్ పోస్ట్ కి నెటిజెన్స్ షాకింగ్ కామెంట్స్..

ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తున్నానని, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసేలా ఎవరు కామెంట్లు చేయకూడదు అంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు తిరుపతి లడ్డు కల్తీ వివాదం ఇంకా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనికి తోడు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. దీంతో పూనమ్ కౌర్ ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం. ఇకపోతే ఈయన క్రిస్టియన్ అయిన అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్.. హిందూ ధర్మం అంటూ హిందూ ధర్మంపై కపట ప్రేమ చూపిస్తూ ప్రజలను వంచన చేస్తున్నాడు అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసినట్లు నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పూనమ్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాదు పవన్ కళ్యాణ్ ను మళ్ళీ టార్గెట్ చేసింది అంటూ నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×