E-Paper
Advertisement

Kalki 2898 AD Record: కల్కి మరో సెన్సేషన్.. రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ సెకండ్ మూవీగా రికార్డు..!

Kalki 2898 AD Record: కల్కి మరో సెన్సేషన్.. రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ సెకండ్ మూవీగా రికార్డు..!
Advertisement

Kalki Smashed 2nd Fastest Rs 1000 Cr In Just 14 Days: రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము దులిపేస్తుంది. కనీ వినీ ఎరుగని రీతిలో అదరగొడుతోంది. ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ సినీ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని కట్టిపడేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇందులో ప్రభాస్ కటౌట్‌కి తగ్గ పాత్ర, పాత్రకు తగ్గ యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో అదిరిపోయాయి. ఫుల్ సూట్ ధరించిన ప్రభాస్ తన బుజ్జి వెహికల్‌పై చేసే యాక్షన్ స్టంట్లు థియేటర్లలో గూస్‌బంప్స్ తెప్పించాయి.

ఇలాంటి పాత్రలో కానీ, ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో కానీ ప్రభాస్‌ను ఇంత వరకు ఏ సినిమాలోనూ చూడలేదని సినీ అభిమానులు మురిసిపోతున్నారు. అంతేకాకుండా ఇతర నటులకు కూడా వారి రేంజ్‌కు తగ్గ పాత్రలు కేటాయించి చూపించిన తీరు అందరినీ బాగా ఆకట్టుకుంది. తీసింది మూడు సినిమాలే అయినా వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎన్నో సినిమాలు చేస్తే కానీ అందని గుర్తింపు కేవలం కల్కి సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ అందుకున్నాడు.

Advertisement

నిజంగా అతడి క్రియేటివిటీ, విజువల్ ఎఫెక్ట్స్‌కి యావత్ సినీ ప్రపంచం సలాం కొట్టింది. ఒక టాలీవుడ్ డైరెక్టర్ ఇంతటి డేరింగ్ చేసి సినిమా తీశాడంటే ఎవరూ నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో తెలుగు సినీ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పాడు దర్శకుడు రాజమౌళి. అయితే ఇప్పుడు ఆ కీర్తిని ‘కల్కి’ సినిమాతో దర్శకుడు నాగ్ అశ్విన్ మరింత పెంచాడు. దీంతో టాలీవుడ్ ఇప్పుడు ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి.

Also Read: ఆ రెండు ఓటీటీల్లోకి ‘కల్కి’ కొత్త ప్రపంచం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Advertisement

ఇక ఫుల్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా రికార్డుల వర్షం కురిపిస్తోంది. బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దులిపేస్తుంది. జూన్ 27న ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.191.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా ఇప్పటికీ తన హవా కొనసాగిస్తోంది. తాజాగా ఈ కల్కి మూవీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, జవాన్, యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ మూవీల రికార్డులను సైతం బ్రేక్ చేసింది. కేవలం 14 రోజుల్లో రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిన ఫాస్టెస్ట్ సెకండ్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. మొదటి స్థానంలో ‘బాహుబలి 2’ ఉంది.

అయితే ఈ కల్కి మూవీ ఏ ఏ సినిమాల రికార్డులను బ్రేక్ చేసిందో అనే విషయానికొస్తే..

14 రోజుల్లో బాహుబలి 2 – రూ.1216 కోట్లు కలెక్ట్ చేసింది.
14 రోజుల్లో కల్కి 2898 ఏడీ – రూ. 1002 కోట్లకు పైగా వసూళు చేసింది.
14 రోజుల్లో ఆర్ఆర్ఆర్ – రూ. 972 కోట్లు
14 రోజుల్లో కేజీఎఫ్ 2– రూ. 948 కోట్లు
14 రోజుల్లో జవాన్ – రూ. 916 కోట్లు
14 రోజుల్లో యానిమల్ – రూ 784 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

 

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×