Big Stories

Kalki 2898 AD OTT: ఆ రెండు ఓటీటీల్లోకి ‘కల్కి’ కొత్త ప్రపంచం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Kalki 2898 AD Streaming on Amazon Prime And Netflix From August 15: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బాక్సాఫీసు వద్ద అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. కనీ వినీ ఎరుగని రీతిలో కలెక్షన్లలో దుమ్ము దులిపేస్తుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ కొత్త ప్రపంచానికి సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాను ఎవరూ ఊహించి ఉండరు. ఇలాంటి సినిమాను ఒక హాలీవుడ్‌లో తప్ప మరే ఇతర ఇండస్ట్రీలోనూ చూసుండరు. కానీ ఇప్పుడు నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీ, విజువల్ ఎఫెక్ట్స్‌తో టాలీవుడ్‌ స్థాయిని ఎక్కడికో తీసుకుపోయాడు.

- Advertisement -

యావత్ సినీ ప్రపంచం మొత్తం ఇప్పుడు కల్కి సినిమా అండ్ దర్శకుడు నాగ్ అశ్విన్ గురించే మాట్లాడుకుంటున్నారు. చేసింది మూడు సినిమాలే.. అయినా దర్శకుడు భారీ హిట్లు అందుకున్నాడు. ఈ మూడింటిలో ఏది కూడా ఫెయిల్ కాలేదు. ఒకటి లవ్ కాన్సెప్ట్‌, మరొకటి బయోపిక్, చివరిది పురాతన కాన్సెప్ట్‌కు సైన్స్ ఫిక్సన్‌ను జోడించి తీసిన కల్కి. ఈ మూడు సినిమాలు అతనికి మంచి విజయాన్ని అందించాయి. దీంతో నాగ్ అశ్విన్ రేంజ్ మారిపోయింది. అలాగే ప్రభాస్ పేరు కూడా యావత్ ప్రపంచం మొత్తం వినిపిస్తోంది.

- Advertisement -

ఇక జూన్ 27న అత్యంత గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచి దుమ్ము దులిపే రెస్పాన్స్‌తో అదరగొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1000 కోట్ల చేరువలో ఉంది. మొదటి రోజు రూ.191.5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికి రూ.850 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అబ్బురపరచింది. ఇకపోతే ఈ చిత్రాన్ని నిర్మాత అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.600 కోట్లతో నిర్మించాడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో నటించిన స్టార్ తారగణం రెమ్యూనరేషన్‌కే సుమారు రూ.250 కోట్లు అయినట్లు తెలుస్తోంది.

Also Read: కలెక్షన్ల సునామి, బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న కల్కి

ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్, శోభన, మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం, ఫరియా అబ్దుల్లా వంటి నటీ నటులు కీలక పాత్రలు పోషించారు. అలాగే దర్శకులు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కేవీ అనుదీప్ వంటి వారు కూడా ఇందులో ఇందులో అతిథి పాత్రలో కనిపించి అదరగొట్టేశారు. మొత్తంగా వీరందరి కలయికతో సినిమా రేంజే మారిపోయిందని చెప్పాలి.

ఇక థియేటర్లలో దుమ్ము దులిపేస్తున్న ‘కల్కి’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని అంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అయిన రెండు సంస్థలు ఓటీటీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది.

దక్షిణాది భాషలకు సంబంధించిన రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో హిందీ రైట్స్‌కు సంబంధించి నెట్స్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రం థియేటర్ రన్ అనంతరం ఏడు లేదా ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో ఈ మూవీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News