BigTV English

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter


Chhattisgarh Encounter(Today news Telugu) : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ వైపు ఉన్న కాంకేర్ బోర్డర్ కర్రెగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు.. తుపాకులు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..


18 రోజుల వ్యవధిలో 21 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారు. మార్చి 19న ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసులు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మార్చి 27న బీజాపూర్ – సుక్మా సరిహద్దు ప్రాంతమైన బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపుర్ భట్టి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఏప్రిల్ 2న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×