E-Paper
Advertisement

Kalki 2898 AD Leak: ‘కల్కి 2898 ఏడీ’ నుండి ప్రభాస్ ఫొటో లీక్.. చూడండి ఎలా ఉన్నాడో..?

Kalki 2898 AD Leak: ‘కల్కి 2898 ఏడీ’ నుండి ప్రభాస్ ఫొటో లీక్.. చూడండి ఎలా ఉన్నాడో..?
Advertisement

Prabhas - Kalki 2898 AD Update

Video Leak from Prabhas Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది ‘సలార్’తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ప్రభాస్‌తో పాటు ఆయన అభిమానుల ఆకలిని తీర్చింది. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అబ్బరపరచింది. ఇందులో దర్శకుడు ప్రశాంత్ నీల్ తన మార్క్ చూపించాడనే చెప్పాలి.

Advertisement

ఇక అదే జోష్‌లో ప్రభాస్ ఇప్పుడు మరొక భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై ఎనలేని అంచనాలను పెంచేశాయి.

ముఖ్యంగా గ్లింప్స్‌లో ప్రభాస్ లుక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ చూసిన ప్రేక్షకులకు అలాగే ఫ్యాన్స్‌కు హాలీవుడ్ మూవీ చూసినంత ఫీలింగ్ వచ్చినట్టయింది. దీంతోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. సైన్స్, పురాణాలు అన్నీ కలిపి ఈ మూవీలో చూపించబోతున్నారు.

Advertisement

READ MORE: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై దర్శకుడు క్రేజీ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

కాగా ఇందులో భారీ తారాగణం నటిస్తోంది. టాలీవుడ్ నుంచి రానా, కోలీవుడ్ నుంచి స్టార్ హీరో కమల్ హాసన్, అలాగే బాలీవుడ్ నుంచి బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీతో పాటు మరికొంత మంది నటీ నటులు ఇందులో భాగం కాబోతున్నారు.

ఇక ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఎన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒకటి లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా అలాంటిదే ఈ మూవీ నుంచి మరో ఫొటో లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కూడా ప్రభాస్ ఫొటో కావడం విశేషం. ఆ ఫొటోలో ప్రభాస్ లుక్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది.

Prabhas new movie update

ఇకపోతే తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ ఆసక్తికర అప్డేట్ అందించిన విషయం తెలిసిందే. ఈ మూవీ మహాభారతం నుంచి స్టార్ట్ అయి 2898లో పూర్తవుతుందని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందువల్లనే ఈ సినిమాకు ‘కల్కి 2898ఏడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పుకొచ్చాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×