BigTV English

Cricketer Hanuma Vihari : క్రికెట్‌లో రాజకీయం.. విహారికి మద్దతుగా అశ్విన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్

Cricketer Hanuma Vihari : క్రికెట్‌లో రాజకీయం.. విహారికి మద్దతుగా అశ్విన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Aswin Supports Hanuma Vihari


Chandrababu and Aswin Supports Vihari(Andhra pradesh today news): ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఒక్క నిమిషం కూడా ఉండలేనంటూ.. క్రికెటర్, టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ హనుమవిహారి చేసిన పోస్టు సంచలనం రేపింది. అందుకు కారణం.. ఒక రాజకీయ నేత క్రికెట్ లో జోక్యం చేసుకోవడమే. ఆయన కుమారుడి కోసం తనను జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారని హనుమ విహారి వాపోయారు. భవిష్యత్ లో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడేది లేదని స్పష్టం చేశాడు. క్రికెట్ లో ఏపీ రాజకీయ నేత జోక్యం చేసుకోవడం తనను తీవ్రంగా బాధించిందంటూ ఇన్ స్టా లో సంచలన పోస్టు చేశారు.

“ఒక రాజకీయ నేత తన కుమారుడి కోసం నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. రంజీ మ్యాచ్ లో 17వ ఆటగాడిపై.. క్రికెట్ విషయమై అరిచినందుకు.. నాపై అతను రాజకీయనేత అయిన తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆయన నాపై చర్యలు తీసుకోవాలని ఏసీఏ (Andhra Cricket Association)పై ఒత్తిడి తీసుకొచ్చాడు. అందుకే నన్ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఆటపరంగా అరిచాను తప్ప.. ఎవరినీ వ్యక్తిగతంగా నేను ఏమీ అనలేదు. భవిష్యత్తులో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడను.” అని హనుమ విహారి తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చాడు.


హనుమ విహారి తన పోస్టులో ఆ ప్లేయర్ ఎవరో చెప్పకపోయినా.. యువప్లేయర్ కేఎన్ పృథ్వీరాజ్ తనంతట తానుగా స్పందించడంతో ఆ రాజకీయ నేత ఎవరనేది అందరికీ తెలిసిపోయింది. విహారి పోస్టుపై స్పందించిన పృథ్వీరాజ్.. అతను సింపతీ గేమ్స్ ఆడుతున్నాడని, ఆ రోజు ఏం జరిగిందో అందరికీ తెలుసంటూ ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చాడు.

కాగా.. హనుమవిహారి ఇన్ స్టా పోస్ట్ పై భారత క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ క్రమంలో మరో క్రికెటర్ అశ్విన్ X వేదికగా స్పందించాడు. Kutty stories with ash “ Vihari Garu “ మీరు రెడీగా ఉన్నారా హనుమ విహారి ? అని అడగ్గా.. మీరెప్పుడంటే అప్పుడు రెడీ అని విహారి బదులిచ్చాడు. అది అశ్విన్ యూట్యూబ్ ఛానల్. తన యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడాలని అడగడంతో.. అందుకు విహారి ఓకే చెప్పాడు.

మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూడా విహారికి మద్దతుగా నిలిచారు. అధికార పార్టీ చేస్తున్న ప్రతీకార రాజకీయాలకు ఏసీఏ కూడా లొంగిపోవడం సిగ్గుచేటంటూ X వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక క్రికెటర్ ఆంధ్ర తరఫున ఎప్పటికీ ఆడనని ప్రకటించే స్థాయికి తీసుకొచ్చేశారని మండిపడ్డారు. హనుమ విహారి ధైర్యంగా ఉండాలని, క్రికెట్ పట్ల మీకున్న చిత్తశుద్ధి, నిబద్ధతే సరైన సమాధానం చెబుతాయని మద్దతిచ్చారు. నారా లోకేష్ సైతం ట్విట్టర్ వేదికగా విహారికి సపోర్ట్ ఇచ్చారు.

దీనిపై వైఎస్ షర్మిల కూడా ఘాటుగా స్పందించారు.

ఇదిలా ఉండగా.. విహారి వ్యవహారంపై క్రికెటర్లు, రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తుండటంతో బీసీసీఐ దీనిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ను వివరణ కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం.. ఈ వ్యవహారంపై X వేదికగా స్పందించారు. “16 టెస్టు మ్యాచ్‌లలో మన ‘భరత్’కు ప్రాతినిధ్యం వహించి, 5 హాఫ్ సెంచరీలు & ఒక సెంచరీ, ఆస్ట్రేలియాతో జరిగిన సిడ్నీ టెస్టులో అతని వీరాభిమానాలు మరువలేనివి.

ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్‌గా, గత 7 ఏళ్లలో ఆంధ్ర జట్టు 5 సార్లు నాకౌట్‌కు అర్హత సాధించడంలో సహాయపడ్డాడు. ఈ రోజు, వైసీపీ కార్పొరేటర్ కోరుకున్న కారణంగానే ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విహారి కెప్టెన్సీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. మన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కి ఇండియన్ క్రికెటర్ & ఆంధ్రప్రదేశ్ రంజీ టీమ్ కెప్టెన్ కంటే క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేని స్థానిక YCP రాజకీయ నాయకుడు చాలా విలువైనవాడు. ఎంత అవమానం!

Mr.Jagan Mohan Reddy.. రాష్ట్ర క్రికెట్ సంఘం మన ఆంధ్రా క్రికెట్ టీమ్ కెప్టెన్‌ని అవమానించి అవమానించినప్పుడు ‘ఆడుదాం ఆంధ్రా’ లాంటి ఈవెంట్‌లలో కోట్లాది డబ్బు ఖర్చు చేయడం ఏమిటి?

ప్రియమైన హనుమవిహారి.. మీరు రాష్ట్రానికి, దేశానికి ఛాంపియన్ ప్లేయర్. మీ సేవలకు ఆంధ్రాలోని చిన్న పిల్లలు, క్రీడాకారులను ప్రేరేపించినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆటగాళ్లను గౌరవించడం, గౌరవంగా చూడడం తెలిసిన స్టేట్ బోర్డ్‌తో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను ఆశిస్తున్నాను.” అని ట్వీట్ లో పేర్కొన్నారు.

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×