BigTV English

Raja Saab: రాజా సాబ్.. దూకుడు పెంచిన ప్రభాస్.. డబ్బింగ్ పూర్తి.. టీజర్ రిలీజ్ అప్పుడే!

Raja Saab: రాజా సాబ్.. దూకుడు పెంచిన ప్రభాస్.. డబ్బింగ్ పూర్తి.. టీజర్ రిలీజ్ అప్పుడే!

Raja Saab: కమర్షియల్ డైరెక్టర్ మారుతి (Maruthi)దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన చిత్రం “ది రాజా సాబ్”. (The Raaja Saab)రొమాంటిక్ హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇటీవల కాలంలో ప్రభాస్ ఈ తరహా పాత్రలలో నటించకపోవడంతో ఈ సినిమాపై అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ ఇంకా విడుదలకు మాత్రం నోచుకోలేక పోతుంది. పలు కారణాలవల్ల ఈ సినిమా తరచూ వాయిదా పడుతూ వస్తుంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ చిత్ర బృందం ప్రకటించారు కానీ మరోసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది.


ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల గురించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 5, 2025వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం వెలబడలేదు. ఇలా ఈ సినిమా విడుదల తేదీ విషయం పక్కన పెడితే తాజాగా మరొక అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

డబ్బింగ్ పూర్తి చేసిన ప్రభాస్..


అతి త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక మేజర్ అప్డేట్ రాబోతుందని వార్తలు వినపడుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ తో పాటుగా ఈ సినిమా టీజర్ విడుదల చేయాలనే ఆలోచనలో డైరెక్టర్ మారుతి ఉన్నట్టు సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో డైరెక్టర్ మారుతి ఇప్పటికే టీజర్ కూడా కట్ చేశారని, అందుకు సంబంధించి ప్రభాస్ కూడా డబ్బింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై అధికారిక ప్రకటన వెలవడాల్సి ఉంది.

రాజా సాబ్ నుంచి బిగ్ అప్డేట్… 

ఇక రాజా సాబ్ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండటం విశేషం.మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా, ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఒకవైపు షూటింగ్ పనులు జరుపుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటున్నారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రభాస్ చివరిగా కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం ఈయన కల్కి 2, సలార్ 2, ఫౌజి, స్పిరిట్ వంటి సినిమాలకు కమిట్ అయ్యి వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×